Thursday, February 25, 2010

Brahma Kadigina Paadam Lyrics in Telugu

బ్రహ్మ కడిగిన పాదము సాహిత్యం...
పల్లవి:
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము

చరణం:
చెలగి వసుధ కొలిచిన నీ పాదము - బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము - బలరిపు గాచిన పాదము

కామిని పాపము కడిగిన పాదము - పాము తలనిడిన పాదము
ప్రేమతో శ్రీ సతి పిసికెడి పాదము - పామిడి తురగపు పాదము

పరమ యోగులకు పరిపరి విధముల - పరమొసగెడి నీ పాదము
తిరువేంకట గిరి తిరమని చూపిన - పరమ పాదము నీ పాదము


Saturday, February 20, 2010

Vathapi Ganapathim Bhaje...

వాతాపి గణపతిం భజే సాహిత్యం...


పల్లవి:
వాతాపి గణపతిం భజే ' హం 
వారణాస్యం వరప్రదం శ్రీ 


అనుపల్లవి:
భూతాది సంసేవిత చరణం 
భూత భౌతిక ప్రపంచ భరణం
వీత రాగిణం వినత యోగినం 
విశ్వ కారణం విఘ్న వారణం  

చరణం:
పురా కుంభ సంభావ మునివర 
ప్రపూజితం త్రికోణ మధ్య గతం 
మురారి ప్రముఖాద్యుపాసితం  
మూలాధారా క్షేత్రాస్థితం


పరాది చత్వారి వాగాత్మకం 
ప్రణవ స్వరూప వక్ర తుండం 
నిరంతరం నిటిల చంద్ర ఖండం 
నిజ వామ కర విధ్రుతేక్షు దండం


కరాంబుజ పాస బీజా పూరం
కలుష విదూరం భూతాకారం 
హరాది గురుగుహ తోషిత బింబం 
హంసధ్వని భూషిత హేరంబం 

Wednesday, February 17, 2010

Namo Namo Raghukula Nayaka Lyrics in Telugu

నమో నమో రఘుకుల నాయక సాహిత్యం...

                                           

పల్లవి:
నమో నమో రఘుకుల నాయక దివిజ వంద్య
నమో నమో శంకర నగజానుతా

చరణం 1:
విహిత ధర్మ పాలకా వీర దశరథ రామా
గహన వాసిని తాటక మర్దన
అహల్య శాప విమోచన అసుర కుల భంజనా
సహజ విశ్వామిత్ర సవన రక్షకా

చరణం 2:
హర కోదండ హర సీతంగానా వల్లభ
ఖర దూషణారి వాలి గర్వాపహ
ధరణి దనూజాది దనుజుల పాలకా
శరధి రంగన కృత్య సౌమిత్రి సమేతా

చరణం 3:
బిరుద రావణ శిరోభేదక విభీషణ వరద
సాకేత పురవాస రాఘవా
నిరుపమ శ్రీవేంకట నిలయ నిజ సకల
పురవర విహారా పుండరీకాక్ష

Sunday, February 7, 2010

Nama Ramayanam Lyrics in Telugu

నామ రామాయణం సాహిత్యం...

                                                          

బాలకాండం

          శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ |
          కాలాత్మక పరమేశ్వర రామ్||
          
          శేషతల్ప సుఖ నిద్రిత రామ్|
          బ్రహ్మద్యమర ప్రార్థిత రామ్ ||

          చండ కిరణ కుల మండన రామ్|
          శ్రీమద్ దశరథ నందన రామ్||

          కౌసల్య సుఖ వర్ధన రామ్ |
          విశ్వామిత్ర ప్రియధన రామ్ ||

          ఘోర తాటక ఘాతక రామ్ |
          మారీచాది నిపాతక రామ్||

          కౌశిక మఖ సంరక్షక రామ్ |
          శ్రీమదహ్ల్యోద్ధారక రామ్||

          గౌతమ ముని సంపూజిత రామ్ |
          సుర ముని వర గణ సంస్తుత రామ్ ||

          నావికధావిత మృదుపద రామ్ |
          మిథిలాపుర జన మోహక రామ్ ||

          విదేహ మానస రంజక రామ్ |
          త్ర్యంబక కార్ముక భంజక రామ్||

          సీతార్పిత వర మాలిక రామ్ |
          క్రుతవైవాహిక కౌతుక రామ్||

          భార్గవ దర్ప వినాశక రామ్ |
          శ్రీమద్ అయోధ్య పాలక రామ్ ||
          రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్  

అయోధ్య కాండం

          అగణిత గుణగణ భూషిత రామ్ |
          అవనీతనయ కామిత రామ్ ||

          రాకా చంద్ర సమానన రామ్ |
          పితృ వాక్యా శ్రిత కానన రామ్ ||

          ప్రియ గుహ వినివేదిత పద రామ్ |
          తక్షాలిత నిజ మృదుపద రామ్ ||

          భరద్వాజ ముఖానందక రామ్ |
          చిత్రకూటాద్రి నికేతన రామ్ ||

          దశరథ సంతత చింతిత రామ్|
          కైకేయి తనయార్థిత రామ్ ||

          విరచిత నిజ పితృ కర్మక రామ్ |
          భరతార్పిత నిజ పాదుక రామ్ ||
          రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్ 

అరణ్య కాండం

          దండకావనజన పావన రామ్ |
          దుష్ట విరాధ వినాశన రామ్ ||
 
          శరభంగ సుతీక్షనార్చిత రామ్ |
          అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్ ||

          గ్రుఘ్రాదిప సంసేవిత రామ్ |
          పంచవటీ తట సుస్థిత రామ్ ||

          శూర్పనఖార్తి విధాయక రామ్ |
          ఖరదూషణ ముఖ సూదక రామ్ ||

          సీతాప్రియ హరినానుగా రామ్ |
          మారీచార్తి క్రుదాశుగ రామ్ ||

          వినష్ట సీతాన్వేషక రామ్ |
          గ్రుద్రాదిప గతి దాయక రామ్ ||

          శబరీ దత్త ఫలాశన రామ్ |
          కబంద బహుచ్చేదన రామ్ ||
          రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్ 

కిష్కింధ కాండం

          హనుమత్సేవిత నిజపద రామ్ |
          నత సుగ్రీవ భీష్టద రామ్ ||

          గర్విత వాలి సంహారక రామ్ |
          వానర దూత ప్రేశక రామ్ ||

          హితకార లక్ష్మణ సంయుత రామ్ |
          రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్ ||
  
సుందర కాండం

          కపివర సంతత సంస్మృత రామ్ |
          తద్గతి విఘ్న ధ్వంసక రామ్ ||

          సీతా ప్రాణాధారక రామ్ |
          దుష్ట దశానన దూషిత రామ్ ||

          శిష్ట హనుమద్ భూషిత రామ్ |
          సీతా వేదిత కాకావన రామ్  ||

          కృత చూడామణి దర్శన రామ్ |
          కపివర వచనా శ్వాసిత రామ్ ||
          రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్

యుద్ధ కాండం 

          రావణ నిధన ప్రస్థిత రామ్ |
          వానర సైన్య సమావృత రామ్ ||

          శోషిత శరిదిశార్తిత రామ్ |
          విభిషణాభయ దాయక రామ్ ||

          పర్వత సేతు నిబంధక రామ్ |
          కుంభకర్ణ శిరశ్చేదక రామ్ ||

          రాక్షస సంఘ విమర్ధక రామ్ |
          అహిమహి రావణ చారణ రామ్  ||

          సంహృత దశముఖ రావణ రామ్ |
          విధిభవ ముఖసుర సంస్తుత రామ్ ||

          ఖస్థిత దశరథ వీక్షిత రామ్ |
          సీతా దర్శన మోదిత రామ్ ||

          అభిషిక్త విభీషణ నత రామ్ |
          పుష్పకయానా రోహణ రామ్ ||

          భరద్వాజాభినిషేవణ రామ్ |
          భరత ప్రాణ ప్రియకర రామ్ ||

          సాకేతపురి భూషణ రామ్ |
          సకల స్వీయ సమానత రామ్ ||

          రత్నలసత్పీఠాస్థిత రామ్ |
          పట్టాభిషేకాలంకృత రామ్ ||

          పార్థివ కుల సమ్మానిత రామ్ |
          విభిషనార్ప్రిత రంగక రామ్ ||

          కీచ కులనుగ్రహకర రామ్ |
          సకల జీవ సంరక్షక రామ్ ||

          సమస్త లోకధారక రామ్ |
          సకల జీవ సంరక్షక రామ్ ||
          రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్

ఉత్తర కాండం

          ఆగత మునిగణ సంస్తుత రామ్ |
          విశ్రుత దశకంఠోద్భవ రామ్ ||

          సీతా లింగన నిర్వృత రామ్ |
          నీతి సురక్షిత జనపద రామ్ ||

          విపినత్యాజిత జనకజ రామ్ |
          కారిత లవణాసురవధ  రామ్ ||

          స్వర్గత శంబుక సంస్తుత రామ్ |
          స్వతనయ కుశలవ నందిత రామ్ ||

          అశ్వమేధ కృతు దీక్షిత రామ్ |
          కాలావేదిత సురపద రామ్ ||

          ఆయోధ్యక జన ముక్తిద రామ్ |
          విధి ముఖ విబుధానందక రామ్ ||

          తేజోమయ నిజ రూపక రామ్ |
          సంస్ర్ముతి బంధ విమోచక రామ్ ||

          ధర్మ స్థాపన తత్పర రామ్ |
          భక్తి పరాయణ ముక్తిత రామ్ ||

          సర్వ చరాచర పాలక రామ్ |
          సర్వ భవామయ వారక రామ్ ||

          వైకుంఠాలయ సంస్థిత  రామ్ |
          నిత్యానంద పదస్థిత రామ్ ||
          రామ రామ జయ రాజ రామ్ రామ రామ జయ సీతా రామ్

mp3:
          Listen:
          Download Click here





Saturday, February 6, 2010

Hanuman Chaalisa Lyrics in Telugu

హనుమాన్ చాలీసా సాహిత్యం...


                                                        


జయ హనుమాన జ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహులోక ఉజాగర ||


రామదూత అతులిత బలధామ |
అంజని పుత్ర పవన సుతనామా ||


మహావీర విక్రమ బజరంగీ |
కుమతినివార సుమతికే సంగీ ||


కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచితకేశా ||


హథవజ్ర అరుధ్వజా విరాజై |
కాంధే మూంజ జనేవూ సాజై ||


శంకర సువన కేసరి నందన |
తేజ ప్రతాప మహాజగ వందన ||


విద్యావాన గుణీ అతిచాతుర |
రామ కాజ కరివేకో ఆతుర ||


ప్రభు చరిత్ర సునివేకో రసియ |
రామలఖన సీతా మన బసియా ||


సూక్ష్మరూపధరి సియహిదిఖావా |
వికటరూపధరి లంకజలావ ||


భీమరూపధరి అసుర సం హారే |
రామచంద్రకే కాజ సవారే ||


లాయ సజీవన లఖన జియయే |
శ్రీరఘువీర హరిషి వురలాయే ||


రఘుపతి కిన్ హీ బహుత బడాయీ |
తమ మమ ప్రియ భరతహి సమభాఈ ||


సహస్ర వదన తుమ్హారో యశగావై |
అసకహి శ్రీపతి కంఠలగావై ||


సనకాది బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా ||


యమ కుబేర దిగపాల జహతే |
కవి కోవిద కహిసకై కహతే ||


తుమ ఉపకార సుగ్రీవ హికీన్ హా |
రామ మిలాయ రాజపద దీన్ హా ||


తుమ్హారో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయే సబ జగ జానా ||


యుగ సహస్ర యోజన పరభానూ |
లీల్యో తాహీ మధుర ఫలజానూ ||


ప్రభు ముద్రికా మేలిముఖ మాహీ |
జలధి లాంఘిగయే అచరజనాహె ||


దుర్గమ కాజ జగతికే జెతే |
సుగమ అనుగ్రహ తుమ్హారే తేతే ||


రామదుఆరే తుమ రఖవారే |
హోతన అజ్ఞా బినుపైసారే ||


సబ సుఖలహై తుమ్హారీ శరనా |
రుమ రక్షక కహూకో డరనా ||


ఆపనతేజ సం హారో అపై |
తీనో లోక హాంకతే కాంపై ||


భూత పిశాచ నికట నహిఆవై |
మహావీర జబనామ సునావై ||


నాసై రోగ హరై సబపీరా |
జపత నిరంతర హనుమత వీరా ||


సంకటసే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యానజొలావై ||


సబపర రామరాయసిర తాజా |
తినకే కాజ సకల తుమ సాజా ||


ఔర మనోరధ జో కోఈలావై |
సోఇ అమిత జీవన ఫలపావై ||


చారోయుగ పరతాప తుమ్హారా |
హై పరసిద్ధి జగత ఉజియారా ||


సాధుసంతకే తుమ రఖవారే |
అసుర నికందన రామదులారే ||


అష్టసిద్ధి నవనిధి కే దాతా |
అసవర దీన్ హ జానకీ మాతా ||


రామరసాయన తుమ్హారే పాసా |
సాదర తుమ రఘుపతికే దాసా ||


తుమ్హారే భజన రామకొపావై |
జన్మ జన్మకే ధుఃఖబిసరావై ||


అంతకాల రఘుపతి పురజాయీ |
జహ జన్మ హరిభక్త కహయీ ||


ఔర దేవతా చిత్తన ధరయీ |
హనుమత సెయీ సర్వసుఖ కరయీ ||


సంకట హటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బలవీరా ||


జైజైజై హనుమాన గోసాయీ |
క్రుపాకరో గురుదేవకీ నాయీ ||


యహశతవార పాఠకర జోయీ |
చూతహి బంది మహసుఖహోయీ ||


జో యహ పడై హనుమన చాలీసా |
హోయ సిద్ధి సాహీ గౌరీసా ||


తులసీ దాస సదా హరిచేరా |
కీజై నాధ హృదయ మహ డేరా ||

Madhurasthakam Lyrics in Telugu

మధురాష్టకం సాహిత్యం...

                                                    

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం |
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||1||


వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||2||

వేణుర్మధురో రేణుర్మధురః
పాణీర్మధురః పాదం మధురం |
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||3||

గీతం మధురం పీతం  మధురం
భుక్తం మధురం సుప్తం మధురం |
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||4||

కరణం మధురం తరణం మధురం
హరణం మధురం స్మరణం మధురం |
వమితం మధురం షమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||5||

గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా |
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||6||

గోపి మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురం |
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||7||

గోపా మధురా గావో మధురా
యష్టిర్మధురా సృష్టిర్మధురా |
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||8||

ఇతి శ్రీ మత్ వల్లభాచార్య విరచితం  మధురాష్టకం సంపూర్ణం


Thursday, February 4, 2010

Ganesha Pamcharatnam Lyrics in Telugu

గణేశ పంచరత్నం సాహిత్యం...

                                                   

1. ముదకరాత్తమోదకం సదా విముక్తి సాధకం
    కలాధరావతంసతం విలాసి లోక రక్షకం
    అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం
    నతాసుభాసు నాశకం నమామితం వినాయకం

2. నాతే తరాతి భీకరం నవోది తార్క భాస్వరం 
    నమత్సురారి నిర్జనం నతాధికాపదుద్ధరం  
    సురేశ్వరం నిధీశ్వరం గజేస్వరం గణేశ్వరం
    మహేశ్వరం సమాశ్రాయే పరాత్పరం నిరంతరం

3. సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం
    దరేదరోదరం వరం వరే భవక్త్ర మక్షరం
    కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
    మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం

4. అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం
    పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం
    ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం
    కపోల దాన వారణం భజే పురాణ  వారణం

5. నితాంతకాంత దంతకాంతిమంతకాంతకాత్మజం
    అచింత్యరూప మంతహీన మంతరాయ కృంతనం
    హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం
    తమేకదంతమేవతం విచింతయామి సంతతము


Wednesday, February 3, 2010

Natanala Bhramayaku Lyrics in Telugu

నటనల భ్రమయకు నా మనసా సాహిత్యం...

పల్లవి:
నటనల భ్రమయకు నా మనసా |
ఘటియించు హరియే కలవాడు ||

చరణం 1:
ముంచిన జగమిది మోహిని జగము|
పొంచిన యాశ పుట్టించేది |
వంచనల నిజమువలెనే ఉండును |
మంజులు మాయలె మరునాడు ||

చరణం 2:
సరి సంసారము సంతలకూటమి |
సొరిది బజారము చూపేది |
గరిమనేప్పుడు గలకల మనుచుండును |
మరులగు విధమే మాపటికి ||

చరణం 3:
కందువ దేహముగాని ముదియదిది |
అందిన రూప మాడేదిది |
ఎందును శ్రీ వేంకటేశ్వరుండును|
డిందు పడగనిదే తెరమరుగు ||


Kurai ondrum illai Lyrics in Telugu

కురై ఓన్రుం ఇల్లై సాహిత్యం...


 
పల్లవి:                                                                                    
కురై ఓన్రుం ఇల్లై మరైమూర్తి కన్న                               
కురై ఓన్రుం ఇల్లై కన్నా
కురై ఓన్రుం ఇల్లై గోవిందా 


అనుపల్లవి:
కన్నుక్కు తెరియామల్ నిర్కిన్రాయ్ కన్నా
కన్నుక్కు తెరియామల్ నిన్రాలుమేనక్కు
కురై ఓన్రుం ఇల్లై మరైమూర్తి కన్నా


చరణం 1:
వేమ్దియతి  తంతిడ  వెంకటేశ నేన్రిరుక్క
వెండియతు వేరిల్లై మరైమూర్తి కన్నా
మణివన్నా మలయాప్పా గోవిందా గోవిందా


చరణం  2:
తిరైయిన్ పిన్ నిర్కిన్రాయ్ కన్నా - ఉన్నై
మరై ఒతుం న్యానియర్ మట్టుమే కాన్పార్
ఎన్రాలుం కురై ఓన్రుం ఏనాక్కిల్లై కన్నా 


చరణం  3:
కున్రిన్ మేల్ కల్లాకి నిర్కిన్ర వరదా
కురై ఓన్రుం ఇల్లై మరైమూర్తి కన్నా
మణివన్నా మలయాప్పా గోవిందా గోవిందా  
 

చరణం  4:
కలిన్నాలుక్కిరంగి కల్లిలే ఇరంగి
నిలైయాగా కోవిలిల్ నిర్కిన్రాయ్ కేశవా
 

చరణం  5:
యాతుం మరుక్కాత మలైయప్పా - ఉన్ మార్బిల్
ఎతుం తర నిర్కుం కరుణి కడల అన్నై
ఎన్రుం ఇరున్తిడ ఏదు కురై ఎనక్కు
ఓన్రుం కురై ఇల్లై మరైమూర్తి కన్నా
మణివన్నా  మలయాప్పా గోవిందా గోవిందా
 


Monday, February 1, 2010

Jo Achyuthanamda Lyrics

జో అచ్యుతానంద సాహిత్యం...

                                                      

పల్లవి:
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావే పరమానంద రామ గోవిందా

చరణాలు:
నందునింటను చేరి నయము మీరంగా |
చంద్రవదనలు నీకు సేవ సేయంగా |
అందముగా వారిండ్ల ఆడుచుండంగా |
మందలకు దొంగ మా ముద్దు రంగా ||

అంగజుని కన్నా మాయన్న ఇటు రారా |
బంగారు గిన్నెలో పాలు పోసేరా |
దొంగ నీవని సతులు బొంకుచున్నారా |
ముంగిటా నాడరా మోహనాకారా ||

అంగుగా తాళ్ళపాకన్నయ్య చాల |
శృంగార రచనగా చెప్పేనీ జోల |
సంగతిగ సకల సంపదల నీవేళ |
మంగళము తిరుపట్ల మదన గోపాల ||

Sunday, January 24, 2010

Vamde Vaasudevam Lyrics in Telugu

వందే వాసుదేవం సాహిత్యం...

                                                                         

పల్లవి:
వందే వాసుదేవం |
బృందారకాదీశ వందిత పదాబ్జం ||

చరణాలు
ఇందీవర శ్యామం ఇందిరా కుచతటి- |
చందనాంకిత లసత్సారు దేహం |
మందార మాలికా మకుట సంశోభితం |
కందర్ప జనకం అరవిందనాభం ||

ధగ ధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం |
ఖగరాజ  వాహనం కమల నయనం |
నిగమాదిసేవితం నిజరూపశేషప- |
న్నగరాజ శాయినం జ్ఞాననివాసం ||

కరిపురనాథ సంరక్షనే తత్పరం |
కరిరాజవరద సంగతకరాబ్జం |
సరసీరుహాననం చక్రవిభ్రాజితం 
తిరువేంకటాచలధీశం భజేహం ||

Bhaavayami Gopalabaalam Lyrics in Telugu

భావయామి గోపాలబాలం సాహిత్యం

                                                         

పల్లవి:
భావయామి గోపాలబాలం మనస్సేవితం |
తత్పదం చింతయేయం సదా ||

చరణాలు
కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా |
పటల నిన దేనా విభ్రాజమానం |
కుటిల పద ఘటిత సంకుల శింజితానతం |
చటుల నటనా సముజ్వల విలాసం ||

నిరతకర కలితనవనీతం బ్రహ్మాది- |
సుర నికర భావనా శోభిత పదం |
తిరు వేంకటాచలస్థితమనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలం ||

Naanati Batuku Natakamu Lyrics in Telugu

నానాటి బతుకు నాటకము సాహిత్యం...

                                                     

పల్లవి:
నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము

చరణాలు 
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్ట నడిమి పని నాటకము
ఎట్టా ఎదుటా గలది ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము

కుడిచేదన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము
ఒడి గట్టుకొనిన ఉభయకర్మంబుల
గడిదాటిన పుడె కైవల్యము

తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
ఎగువన శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము


Manujudai Putti Lyrics in Telugu

మనుజుడై పుట్టి మనుజుని సేవించి సాహిత్యం...

                                                     

పల్లవి:
మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దు:ఖమందనేలా

చరణం 1:
జుట్టెడు కడుపుకై జొరని చోట్లు జొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసు బెట్టి
వట్టిలంపటము వదలనేరడుగాన

చరణం 2:
అందరిలో పుట్టి అందరిలో బెరిగి
అందరి రూపములటుతానై
అందమైన శ్రీ వెంకటాద్రీశు సేవించి
అందరాని పదమందెనటుగాన

Deva Devam Bhaje Lyrics in Telgu

దేవ దేవం భజే సాహిత్యం...

                                                        

పల్లవి:
దేవ దేవం భజే దివ్య ప్రభావం |
రావణాసుర వైరి రఘు పుంగవం ||

చరం 1:
రాజవర శేఖరం రవికుల సుధాకరం |
ఆజాను బాహుం నీలాభ్ర కాయం |
రాజారి కోదండ రాజదీక్షాగురుం |
రాజీవ లోచనం రామచంద్రం ||

చరణం 2:
నీలజీమూత సన్నిభ శరీర ఘన వి- |
శాల వక్షసం విమల జలజనాభం |
కాలాహి నగ హరం ధర్మ సంస్థాపనం |
భూ లలనధిపం భోగశయనం ||

చరణం 3:
పంకజాసన వినుత పరమ నారాయణం |
సంకరార్జిత చాప దళనం |
లంకా విశోషణం లాలిత విభీషణం |
వేంకటేశం సాధు విబుధ వినతం ||

Saturday, January 23, 2010

Cheri Yasoda Lyrics in Telugu

చేరి యశోదకు శిశువితడు సాహిత్యం...

                                                       

పల్లవి:
చేరి యశోదకు శిశువితడు |
ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు ||

చరణం 1:
సొలసి చూచినను సూర్యచంద్రులను |
లలివేద జల్లెడు లక్షణుడు |
నిలిచిన నిలువున నిఖిల దేవతల |
కలిగించు సురల గనివో యితడు ||

చరణం 2:
మాటలాడిననను మరియజాండములు |
కోటులు వొడమెటి గుణరాశి |
నీటుగా నూర్పుల నిఖిల వేదములు |
చాటుగా నూరెటి సముద్రుడితడు ||

చరణం 3:
ముంగిట పొలసిన మొహనమాత్మల |
పొంగించే ఘన పురుషుడు |
సంగతి మావంటి శరణాగతులకు |
అంగము శ్రీవెంకటాధిపుడితడు ||


Sunday, January 17, 2010

BhajaGovindam Lyrics in Telugu

భజగోవిందం సాహిత్యం...

                                         

భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే 
నహి నహి రక్షతి డుకృణ్ కరణే ||1|| 

భావం: భజించు గోవిందుడిని భజించు గోవిందుడిని... ఓ బుద్ధిహీనుడా గోవిందుడినే భజించు. మరణసమయం ఆసన్నమైనప్పుడు ఈ (డుకృణ్ కరణే లాంటి ) వ్యాకరణ  సూత్రాలు నిన్ను రక్షించవు గాక రక్షించవు.  

 

మూఢ జహీహి ధనాగమతృష్ణాం 
కురు సద్బుద్ధిం మానస వితృష్ణాం
యల్లభసే నిజకర్మోపాత్తం 
విత్తం  తేన వినోదయ చిత్తం ||2||

భావం: ఓ మూర్ఖుడా! ధనసంపాదన ఆశ విడిచిపెట్టు. మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండు. నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దానితో సంతోషంగా ఉండు.  



నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా  మాగామోహావేశం 
ఏతన్మామ్సావసాది వికారం
మనసి విచంతయ వారం వారం ||3||

భావం: స్త్రీల వక్షోజ సౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు. అవి నిజంగా మాంసం, కొవ్వు మొదలైన అసహ్యకర పదార్థములతో కూడినవని నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు. 



నళినీ దలగత జలమతి తరలం
తద్వాజ్జీవితమతిశయచపలం  
విద్ధి వ్యాద్యభిమానగ్రస్తం 
లోకం శోకహతం చ సమస్తం ||4||

భావం: తామరాకు మీద నీటిబొట్టు ఎంత చెంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంత అస్థిరమైనది, అల్పమైనది. అంతేకాదు ఈ మానవ జీవితం అంతా రోగాలతోనూ 'నాది' అన్న మమకారంతోనూ కూడుకున్నట్టిదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైందని తెలుసుకో.



యావద్విత్తోపార్జన సక్తః 
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజీవతి జర్జర దేహే 
వార్తాం కోపి న పృచ్చతి గేహే ||5||

భావం: ఎంతవరకు ధన సంపాదన చెయ్యగలుగుతారో అంతవరకే తనవారంతా ప్రేమగా ఉంటారు. దేహం కాస్త సడలిపోయి, ఏ పని చేయగల శక్తి లేనివారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు. కుశల ప్రశ్నలు కూడా వేయరు. 



యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్చతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే ||6||

భావం: ఎంతవరకైతే ఈ దేహం లో ప్రాణం ఉంటుందో  అంతవరకే ఇంట్లోనివారు క్షేమాన్ని అడుగుతారు. శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే ఆ  చూసి భార్య కూడా భయపడుతుంది. 




బాలాస్తావతీ క్రీడాసక్తః 
తరుణస్తావత్తరుణీసక్తః |
వృద్ధస్తావాచ్చింతాసక్తః
పరమే బ్రహ్మణి కో పి సక్తః ||7||

భావం: మానవుడు - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, యౌవనం లో స్త్రీల  పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా!!!




కా తే కాంతా కస్తే పుత్రః 
సంసారో యమతీవ విచిత్రః |
కస్య త్వం కః కుత ఆయాతః
తత్వం చింతయ తదిహ భ్రాతః ||8||

భావం: నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నీవు ఎవరు? ఎవరికి చెందినవాడవు? ఎక్కడ నుంచి వచ్చావు? ఓ సోదరా! ఆ తత్వాన్ని ఇక్కడే - ఈ దేహం లో ఉండగానే ఆలోచన చేయి. 




సత్సంగత్వే నిస్సంగత్వం 
నిస్సంగత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్వం 
నిశ్చలతత్వే జీవన్ముక్తి: ||9||

భావం: సత్పురుషులతో సాంగత్యం  చేయడం వల్ల  ఈ ప్రాపంచిక విషయాల మీద సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం పోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి. 



వయసి గతే కః కామవికారః 
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారః
జ్ఞాతే తత్వే కః సంసారః ||10||

భావం: వయస్సు మళ్ళిపోతే కామవికారాలుండవు.  నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు. 



మా కురు ధన జన యవ్వన గర్వం  
హరతి నిమేషాత్కాలః సర్వం |
మాయామయమిదమఖిలం హిత్వా 
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా  ||11||

భావం: ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యౌవనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిముషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకున్నది, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో. ఆత్మానుభూతిని చెందు. 



దినయామిన్యౌ సాయం ప్రాతః 
శిశిరవసంతవ్ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః   
తదపి న ముంచత్యాశావాయుః  ||12||

భావం: రాత్రింబవళ్ళు, ఉదయం సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి; పోతుంటాయి. కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయుష్కాలం కూడా అలాగే వెళ్లిపోతుంటుంది. అయినప్పటికీ మానవుడు ఆశ అనే గాలిని మాత్రం వదలడు గాక వదలడు.




కాతే కాంతా ధనగతచింతా 
వాతుల కిం తవ నాస్తి నియంతా |
త్రిజగతి సజ్జనసంగాతిరేకా 
భవతి భవార్ణవతరణే  ||13||

భావం: ఓరి వెఱ్ఱివాడా! ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అన్నిటిని, అందరిని నియమించే సర్వజ్ఞుడైన ప్రభువు లేడనుకున్నావా? ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక. 



ద్వాదశమంజరికాభిరశేషః
కథితో వైయాకరణస్యైషః .
ఉపదేశో భూద్విద్యానిపుణైః
శ్రీమచ్ఛన్కరభగవచ్ఛరణైః  ॥13.అ॥ 

భావం: ఈ పన్నెండు (2-13) శ్లోకాలు శ్రీ శంకర భగవత్పాదులవారు ఒక వ్యాకరణకర్తకి ఉపదేశంగా ప్రసాదించారు. 



జటిలో ముండీ లుంఛితకేశః
కాషాయాంబరబహుకృతవేషః |
పశ్యన్నపి చన పశ్యతి మూఢః
హ్యుదరనిమిత్తం బహుకృతవేషః ||14||

భావం: జడలు కట్టుకొని, గుండు గీయించుకొని, జుట్టు పీకివేసుకొని, కాషాయ వస్త్రాలు ధరించి  వేషాలు వేస్తుంటారు. ఈ వేషాలన్నీ పొట్టకూటికోసమే గాని, వీరు కళ్ళతో చూస్తూ కూడా సత్యాన్ని దర్శించలేని మూర్ఖులు. 



అంగం గలితం పలితం ముండం 
దశనవిహీనం జాతం తుండం |
వృద్ధో యాతి గృహీత్వా దండం 
తదపి న ముంచత్యాశాపిండం ||15||

భావం: శరీరం కృశించిపోయింది, తల నెరసిపోయింది, నోటిలో పళ్ళు ఊడిపోయినవి. ముసలితనం పైబడి కఱ్ఱ చేతికొచ్చింది. ఐనా సరే ఆశల - కోరికల మూట మాత్రం వదిలిపెట్టడు. 



అగ్రే వహ్నిః పృష్ఠేభానుః
రాత్రౌ చుబుకసమర్పితజానుః |
కరతలభిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాసః ||16||

భావం: ఎదురుగా చలిమంట పెట్టుకొని,  వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని, రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకుని కూర్చుంటాడు; తిండి తినడానికి రెండు చేతులూ దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. ఐనా ఆశలు మాత్రం వదలడు. 



కురుతే గంగాసాగారగమనం 
వ్రత పరిపాలన మథవా దానం |
జ్ఞానవిహీనః సర్వమతేన 
ముక్తిం న భజతి జన్మశతేన ||17||

భావం: తీర్థయాత్రలు చేయవచ్చు; పూజలు, నోములు, వ్రతాలు చేయవచ్చు; దానధర్మాలు చేయవచ్చు. కాని ఆత్మజ్ఞానము పొందనివాడు నూఱు జన్మలెత్తినా సరే ముక్తిని పొందలేడని సర్వమతముల విశ్వాసం. 



సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతలమజినం వాసః |
సర్వ పరిగ్రహ భోగ త్యాగః 
కస్య సుఖం న కరోతి విరాగః ||18||

భావం: దేవాలయాల్లోనూ, చెట్ల మొదళ్ళలోనూ నివసిస్తూ; కటిక నేల మీద నిద్రిస్తూ; చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ; దేనినీ గ్రహించకుండా - ఏమీ కావాలని కోరుకోకుండా అన్ని భోగాలను విడిచిపెట్టిన ఏ విరాగికి సుఖం లభించదు? తప్పక లభిస్తుంది. 



యోగరతో వా భోగరతో వా 
సంగరతో వా సంగవిహీనః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ ||19||

భావం: ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు; ఈ ప్రపంచంలో అందరితో కలిసి మెలిసి జీవించవచ్చు లేదా ఒంటరిగా అందరికీ దూరంగా జీవించవచ్చు. కాని ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో అట్టివారే ఆనందిస్తారు. ముమ్మాటికీ అట్టివారికే ఆనందం. 




భగవద్గీతా కించిదధీత
గంగా జలలవ కణికాపీతా |
సకృదపి యేన మురారి సమర్చా 
క్రియతే తస్య యమేవ న చర్చ ||20||

భావం: ఎవరైతే భగవద్గీతని కొంచమైనా అధ్యయనం చేస్తారో, గంగా జలాన్ని కొద్దిగా ఐనా తాగుతారో, కొంచమైనా శ్రీకృష్ణుని పూజిస్తారో అట్టివారికి యమునితో వివాదం ఉండదు. 



పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసార బహు దుస్తారే 
కృపయా పారే పాహి మురారే ||21||

భావం: మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం; మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం - ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం కష్టమైన పని. కనుక ఓ కృష్ణా! దయచేసి మమ్ములను రక్షించు. 



రథ్యా చర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జిత పంథః |
యోగి యోగనియోజిత చిత్తో 
రమతే బాలోన్మత్తవదేవ ||22||

భావం: దారిలో దొరికే గుడ్డ పీలికలతో తయారైన గోచిని ధరించిన వాడై; ఇది పుణ్యమని, అది పాపమని ఏ మాత్రం ఆలోచించక, నిరంతరం మనసుని యోగమునందే నిలిపిన యోగిపుంగవుడు ఈ లోకంలో బాలునిలాగ, పిచ్చివానిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. 



కస్త్వం కోహం కుత ఆయాతః
కా మే జనని కో మే తాతః |
ఇతి పరభావయ సర్వమసారం 
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం ||23||

భావం: నీవెవరు? నేనెవరు? ఎక్కడ నుండి వచ్చాను? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? ఇదీ నువ్వు విచారణ చెయ్యవలసినది. ఈ ప్రపంచం సారహీనమైనది; కేవలం కలలో కనిపించు దృశ్యం లాంటిదే అని దీనిని విడిచిపెట్టు. 



త్వయి మయి చాన్యత్రైకో విష్ణు:
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు: |
భవ సమచిత్తః  సర్వత్ర త్వం
వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం ||24||


భావం: నీలోను, నాలోను, ఇతరులలోను ఉన్నది ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే. సహనం లేనివాడివి కనుక నాపై కోపగించుకుంటున్నావు. నీవు బ్రహ్మత్వం (మోక్షం) ను పొందగోరితివా! అంతటా - అన్నివేళలా సమబుద్ధిని కలిగి ఉండు. 



శత్రౌ మిత్రే పుత్రే బంధవ్ 
మా కురు యత్నం విగ్రహ సంధవ్ |
సర్వస్మిన్నపి పశ్యాత్మానం 
సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం ||25||

భావం: శత్రువు గాని, మిత్రుడు గాని, పుత్రుడు గాని,  బంధువు గాని - వీరిపట్ల శత్రుత్వమో, స్నేహమో చేసే యత్నం మానుకో. అందరిలోను ఆత్మను చూస్తూ, భేదభావాన్ని అన్ని సందర్భాలలోనూ విడిచిపెట్టు. 




కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వా త్మానం భావయ కోహం |
ఆత్మజ్ఞాన విహీనా మూడాః
తే పచ్యంతే నరకనిగూడః ||26||

భావం: కోరిక, కోపం, లోభం, భ్రాంతి - వీటన్నిటిని విడిచిపెట్టిన సాధకుడు "ఆ పరమాత్మను నేనే " అనే సత్యాన్ని దర్శిస్తాడు. ఆత్మజ్ఞానం లేనివారు మూఢులు. అట్టివారు ఈ సంసార జనన మరణ చక్రం అనే నరకంలో బంధింపబడి హింసించబడతారు. 



గేయం గీతా నామ సహస్రం 
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జన సంగే చిత్తం 
దేయం దీనజనాయ చ విత్తం ||27||

భావం: భగవద్గీత, విష్ణు సహస్రనామాలను గానం చెయ్యాలి. ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యంలో మనసుని నడపాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చెయ్యాలి. 


సుఖతః క్రియతే రామాభోగః 
పశ్చాద్ధంత శరీరే రోగః |
యద్యపి లోకే మరణం శరణం 
తదపి న ముంచతి పాపాచరణం ||28||

భావం: సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతి కార్యంలో నిమగ్నమవుతారు. దాని కారణంగా శరీరం రోగాలపాలవుతుంది. చివరికి మరణం అనేది ఎవరికి తప్పదు. ఐనా సరే మానవుడు పాప కార్యములను వదలనే వదలడు. 



అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశః సత్యం |
పుత్రాదపి ధన భాజాం భీతి:
సర్వత్రైషా విహితా రీతి: ||29||

భావం: డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. దాని వల్ల కొంచం సుఖం కూడా లేదు అనే మాట సత్యం. ధనవంతునికి తన కుమారిని వల్ల కూడా భయమే. అన్ని చోట్ల డబ్బు యొక్క పద్ధతి ఇంతే. 



ప్రాణాయామం ప్రత్యాహారం 
నిత్యానిత్య వివేకవిచారం |
జాప్యసమేత సమాధివిధానం 
కుర్వవధానం మహదవధానం ||30||

భావం: క్రమపద్ధతిలో శ్వాసను నియమించడం; విషయాల నుండి మనసుని వెనక్కి మళ్లించడం; నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో నిరంతరం బుద్ధితో విచారించడం; జపంతో కూడుకున్న ధ్యాననిష్ఠను సాగించి సర్వ సంకల్పాలను విడిచిపెట్టడం అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించు. 



గురుచరణా౦బుజ నిర్భర భక్తః
సంసారాదచిరార్భవ ముక్తః |
సేంద్రియమానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ||31||

భావం: గురుచరణ కమలములనే సర్వస్వంగా భావించిన ఓ భక్తుడా! నీ ఇంద్రియాలను, మనసుని నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ చావు పుట్టుకులతో కూడిన సంసార సాగరం నుండి ముక్తుడవై, నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారం పొందెదవు గాక! 



మూఢః కశ్చన వైయాకరణో
డుకృన్కరణాధ్యయన ధురిణః .
శ్రీమచ్ఛమ్కర భగవచ్ఛిష్యై
బోధిత ఆసిచ్ఛోధితకరణః ॥32॥ 

భావం: వ్యాకరణ నియమాలతో తనను తాను కోల్పోయి మూఢుడైన వ్యాకరణకర్త, శంకర భగవత్పాదులవారి బోధనలతో కడిగివేయబడ్డాడు. 



భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
నామస్మరణాదన్యముపాయం
నహి పశ్యామో భవతరణే ॥33॥ 

భావం: భజించు గోవిందుని! భజించు గోవిందుని! ఓ మూఢుడా  గోవిందుడినే భజించు. సంసార సాగరాన్ని దాటడానికి గోవింద నామస్మరణకి మించినది లేదు.



|| ఇతి భజగోవిందం సంపూర్ణం ||



In M.S Amma Voice



Complete verses