చేరి యశోదకు శిశువితడు సాహిత్యం...
పల్లవి:
చేరి యశోదకు శిశువితడు |
ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు ||
చరణం 1:
సొలసి చూచినను సూర్యచంద్రులను |
లలివేద జల్లెడు లక్షణుడు |
నిలిచిన నిలువున నిఖిల దేవతల |
కలిగించు సురల గనివో యితడు ||
చరణం 2:
మాటలాడిననను మరియజాండములు |
కోటులు వొడమెటి గుణరాశి |
నీటుగా నూర్పుల నిఖిల వేదములు |
చాటుగా నూరెటి సముద్రుడితడు ||
చరణం 3:
ముంగిట పొలసిన మొహనమాత్మల |
పొంగించే ఘన పురుషుడు |
సంగతి మావంటి శరణాగతులకు |
అంగము శ్రీవెంకటాధిపుడితడు ||
No comments:
Post a Comment