మనుజుడై పుట్టి మనుజుని సేవించి సాహిత్యం...
పల్లవి:
మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దు:ఖమందనేలా
చరణం 1:
జుట్టెడు కడుపుకై జొరని చోట్లు జొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసు బెట్టి
వట్టిలంపటము వదలనేరడుగాన
చరణం 2:
అందరిలో పుట్టి అందరిలో బెరిగి
అందరి రూపములటుతానై
అందమైన శ్రీ వెంకటాద్రీశు సేవించి
అందరాని పదమందెనటుగాన
No comments:
Post a Comment