దేవ దేవం భజే సాహిత్యం...
పల్లవి:
దేవ దేవం భజే దివ్య ప్రభావం |
రావణాసుర వైరి రఘు పుంగవం ||
చరం 1:
రాజవర శేఖరం రవికుల సుధాకరం |
ఆజాను బాహుం నీలాభ్ర కాయం |
రాజారి కోదండ రాజదీక్షాగురుం |
రాజీవ లోచనం రామచంద్రం ||
చరణం 2:
నీలజీమూత సన్నిభ శరీర ఘన వి- |
శాల వక్షసం విమల జలజనాభం |
కాలాహి నగ హరం ధర్మ సంస్థాపనం |
భూ లలనధిపం భోగశయనం ||
చరణం 3:
పంకజాసన వినుత పరమ నారాయణం |
సంకరార్జిత చాప దళనం |
లంకా విశోషణం లాలిత విభీషణం |
వేంకటేశం సాధు విబుధ వినతం ||
No comments:
Post a Comment