Wednesday, December 30, 2009

Sesha Saila vaasa Lyrics

శేషశైల వాస సాహిత్యం...

పల్లవి:
శేషశైల వాస శ్రీ వెంకటేశ శయనించు మా అయ్యా శ్రీ చిద్విలాసా ||2||

చరణం:
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ అలమేలుమంగాకూ అలుక రానీయకూ ||2||
ముద్దు సతులిద్దరినీ ఇరువైపులా జేర్చి ||2||
మురిపించి లాలించి ముచ్చటల దేల్చి ||2||  |శేషశైల వాస|

చరణం:
పట్టు పానుపు పైన పవ్వలించర స్వామి ||2||
భక్తులందరూ నిన్ను ప్రస్తుతించీ పాడ
చిరునగావులోలుకుచూ నిదురించు నీ మోము ||2||
కరుతీరా గాంచి తరియింతుమూ మేము    |శేషశైల వాస|

Aakasa Veedhilo Andaala Jaabili Lyrics

ఆకాశ వీధిలో అందాల జాబిలీ సాహిత్యం...

పల్లవి:
ఆకాశ వీధిలో అందాల జాబిలీ వయ్యారి తారను జేరి
ఉయ్యాలలుగేనే సయ్యాటలాడెనే ||3||

చరణం 1:
జలతారు మేలిమొబ్బు పరదాలు నేసీ తెరచాటు చేసి
పరువాలు దాగి దాగి పంతాలు పోయీ పందాలు వేసి
అందాల చందామామ దొంగాటలాడెనే దోబూచులాడెనే ||ఆకాశ వీధిలో||

చరణం 2:
జడివాన హోరుగాలి సుడిరేగి రానీ జడిపించబోని
కలకాలం నీవే నేనని పలుబాసలాడీ చెలి చెంత చేరీ
అందాల చందామామ అనురాగం చాటేనే నయగారం చేసెనే ||ఆకాశ వీధిలో||

Hayi Hayiga lyrics

హాయి హాయిగా ఆమని సాగే సాహిత్యం...


పల్లవి:       హాయి  హాయిగా  ఆమని  సాగే
                హాయి  హాయిగా  ఆమని  సాగే
                సోయగాల గని హోయీ  సఖా హాయీ సఖా
                లీలగా పూవులు గాలికి ఊగా ఆ..ఆ..ఆ
                సనిదమదనిస గమగమదనిస 
                రిసనిసని సరిస నిసరిస  ని దనిని దనిని దని  మదద మదద మద  సరిగమదని
                లీలగా పూవులు గాలికి ఊగా
                కలిగిన తలపుల వలపులు రేగా  ॥ 2 ॥                 
                ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా  ఆ..ఆ

చరణం 1:    ఏమో ఏమో తట్టిల్లతికమేమెరుపు
                 ఏమో ఏమో తట్టిల్లతికమేమెరుపు మైమరపేమో
                 మొయిలు రాజు దరి మురిసినదేమో మైమరపేమో
                 మొయిలు రాజు దరి మురిసినదేమో
                 వలపు కౌగిలుల వాలి సోలి వలపు కౌగిలుల వాలి సోలి
                 ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా  ||హాయి  హాయిగా||

చరణం 2:    చూడుమా చందమామ అటు చూడుమా చందమామ
                 కనుమా వయారి శారదయామిని కవ్వించే ప్రేమా చూడుమా చందమామ
                 వగలా తూలే విరహినులా వగలా తూలే విరహినులా
                 మనసున మోహము రేపు నగవులా మనసున మోహము రేపు నగవులా
                 ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా   ||హాయి  హాయిగా||

చరణం 3:    ఆ..ఆ.ఆ కనుగావా తనియగా ప్రియతమా కాలువలు విరిసేనుగా
                కనుగవ తనియగా ప్రియతమా కాలువలు విరిసేనుగా కనుగవ తనియగా
                చెలువము కనుగొనా...ఆ..ఆ.చెలువము కనుగొనా మనసానంద నాట్యాలు సేయునోయీ
                ఆనంద నాట్యాలు సేయునోయీ
                రిరిగమదనిస దనిస - 
                సనిసగరిగ సరినిస సనిమదనిస - 
                నిరినిరి దనిదని మదమద గమగమ గమ దనిస గమ దనిస దనిసా





Sunday, December 27, 2009

Marali marali Jaya Mangalamu Lyrics

మరలి మరలి జయ మంగళము  సాహిత్యం...


                                        


పల్లవి:

మరళి మరళి జయ మంగళము |
సొరిది నిచ్చలును శుభ మంగళము ||

చరణం 1:
కమలా రమణికి కమలాక్షునకును |
మమతల జయ జయ మంగళము
అమర జననికిని అమరవంద్యునకు |
సుముహూర్తముతో శుభ మంగళము ||

చరణం 2:
జలధికన్యకును జలధిశాయికిని |
మలయుచును శుభ మంగళము |
కలిమికాంతకు ఆ కలికి విభునికిని |
సుళువులయారతి శుభ మంగళము ||

చరణం 3:
చిత్తజు తల్లికి శ్రీ వేంకటపతికి |
మత్తిల్లిన జయ మంగళము |
ఇత్తల నత్తల ఇరువురకౌగిట |
జొత్తుల రతులకు శుభ మంగళము ||



భారత జాతీయగీతం

జన గణ మన సాహిత్యం...

జన గణ మన అధినాయక జయహే
భారత భాగ్య విధాతా
పంజాబ సింధు గుజరాత మరాఠా
ద్రావిడ ఉత్కళ వంగా
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభ నామే జాగే
తవ శుభ ఆశిష మాగే
గాహే తవ జయ గాథా
జన గణ మంగళ దాయక జయహే
భారత భాగ్య విధాతా
జయహే జయహే జయహే
జయ జయ జయ జయహే


Thursday, December 24, 2009

Enthamaatramula Evvaru Thalachina Lyrics in Telugu

ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన...

పల్లవి:
         ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమె నీవు ||2||
         అంతరాంతములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లూ ||2||
చరణం 1:
          కొలుతురు మిము వైష్ణవులూ కూరిమితో విష్ణుడని
          పలుకుదురూ మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు ||2||
          తలతురు మిము శైవులు తగిన భక్తులునూ శివుడనుచు ||2||
          అలరిపుగడుదురు కాపాలికులు ఆది భైరవుడనుచూ ||2||  |ఎంత|

చరణం2:
           సరినన్ను దురుశాక్తేయులూ శక్తి రూపు నీవనుచు
           దరిశనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు ||2||
 
           సిరులమిముయే అల్పబుద్ధి  తలచిన వారికి అల్పంబవుదువు
           గరిమలమిముయే  ఘనమని తలచిన ఘనబుద్ధ్హులకు ఘనుడవూ

           నీవలన కొరతేలేదు మరి నీరు కొలది తామరవు
           ఆవల భాగీరథి తరి బావుల ఆ జలమే ఊరినయట్లు ||2||

           శ్రీ వెంకటపతి నీవై దేహము చేకొని ఉన్న దైవమని ||2||
           నీవలెనే నీ శరననియదనూ

           ఇదియే పరతత్వము నాకు ||౩||


Sundaranga Maruvaga Lenoy Lyrics

సుందరంగా మరువగలేనోయ్ రావేలా ... పాట సాహిత్యం 

పల్లవి:
        సుందరంగా మరువగలేనోయ్ రావేలా నా అందచందములు దాచితి నీకై రావేల   ||2|| 


చరణం 1: 
         ముద్దు నవ్వులా మోహన కృష్ణ రావేలా ||2||
         నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలు ||2||       |సుందరంగా|


చరణం 2:
         మేని కనులలో వాలు చూపులా ఆ వేళా 
         నను చూసి కను సైగ చేసితివోయీ రావేల ||2||
         కాలి మువ్వల కమ్మని పాటా రావేలా ||2||
         ఆ మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెమున కలగలపూ ||2||    |సుందరంగా|


చరణం 3:  
         హృదయ వీణ తీగలు మీటి ఆ వేళా 
         అనురాగ రసములే చిందితివోయీ రావేల ||2||
         మనసు నిలువదోయ్ మధు వసంతమోయ్  రావేలా ||2||
         పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే ||2||     |సుందరంగా|