వందే వాసుదేవం సాహిత్యం...
పల్లవి:
వందే వాసుదేవం |
బృందారకాదీశ వందిత పదాబ్జం ||
చరణాలు
ఇందీవర శ్యామం ఇందిరా కుచతటి- |
చందనాంకిత లసత్సారు దేహం |
మందార మాలికా మకుట సంశోభితం |
కందర్ప జనకం అరవిందనాభం ||
ధగ ధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం |
ఖగరాజ వాహనం కమల నయనం |
నిగమాదిసేవితం నిజరూపశేషప- |
న్నగరాజ శాయినం జ్ఞాననివాసం ||
కరిపురనాథ సంరక్షనే తత్పరం |
కరిరాజవరద సంగతకరాబ్జం |
సరసీరుహాననం చక్రవిభ్రాజితం
తిరువేంకటాచలధీశం భజేహం ||
No comments:
Post a Comment