Wednesday, February 3, 2010

Natanala Bhramayaku Lyrics in Telugu

నటనల భ్రమయకు నా మనసా సాహిత్యం...

పల్లవి:
నటనల భ్రమయకు నా మనసా |
ఘటియించు హరియే కలవాడు ||

చరణం 1:
ముంచిన జగమిది మోహిని జగము|
పొంచిన యాశ పుట్టించేది |
వంచనల నిజమువలెనే ఉండును |
మంజులు మాయలె మరునాడు ||

చరణం 2:
సరి సంసారము సంతలకూటమి |
సొరిది బజారము చూపేది |
గరిమనేప్పుడు గలకల మనుచుండును |
మరులగు విధమే మాపటికి ||

చరణం 3:
కందువ దేహముగాని ముదియదిది |
అందిన రూప మాడేదిది |
ఎందును శ్రీ వేంకటేశ్వరుండును|
డిందు పడగనిదే తెరమరుగు ||


No comments: