జో అచ్యుతానంద సాహిత్యం...
పల్లవి:
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావే పరమానంద రామ గోవిందా
చరణాలు:
నందునింటను చేరి నయము మీరంగా |
చంద్రవదనలు నీకు సేవ సేయంగా |
అందముగా వారిండ్ల ఆడుచుండంగా |
మందలకు దొంగ మా ముద్దు రంగా ||
అంగజుని కన్నా మాయన్న ఇటు రారా |
బంగారు గిన్నెలో పాలు పోసేరా |
దొంగ నీవని సతులు బొంకుచున్నారా |
ముంగిటా నాడరా మోహనాకారా ||
అంగుగా తాళ్ళపాకన్నయ్య చాల |
శృంగార రచనగా చెప్పేనీ జోల |
సంగతిగ సకల సంపదల నీవేళ |
మంగళము తిరుపట్ల మదన గోపాల ||
No comments:
Post a Comment