నమో నమో రఘుకుల నాయక సాహిత్యం...
పల్లవి:
నమో నమో రఘుకుల నాయక దివిజ వంద్య
నమో నమో శంకర నగజానుతా
చరణం 1:
విహిత ధర్మ పాలకా వీర దశరథ రామా
గహన వాసిని తాటక మర్దన
అహల్య శాప విమోచన అసుర కుల భంజనా
సహజ విశ్వామిత్ర సవన రక్షకా
చరణం 2:
హర కోదండ హర సీతంగానా వల్లభ
ఖర దూషణారి వాలి గర్వాపహ
ధరణి దనూజాది దనుజుల పాలకా
శరధి రంగన కృత్య సౌమిత్రి సమేతా
చరణం 3:
బిరుద రావణ శిరోభేదక విభీషణ వరద
సాకేత పురవాస రాఘవా
నిరుపమ శ్రీవేంకట నిలయ నిజ సకల
పురవర విహారా పుండరీకాక్ష
No comments:
Post a Comment