వందే వాసుదేవం సాహిత్యం...
పల్లవి:
వందే వాసుదేవం |
బృందారకాదీశ వందిత పదాబ్జం ||
చరణాలు
ఇందీవర శ్యామం ఇందిరా కుచతటి- |
చందనాంకిత లసత్సారు దేహం |
మందార మాలికా మకుట సంశోభితం |
కందర్ప జనకం అరవిందనాభం ||
ధగ ధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం |
ఖగరాజ వాహనం కమల నయనం |
నిగమాదిసేవితం నిజరూపశేషప- |
న్నగరాజ శాయినం జ్ఞాననివాసం ||
కరిపురనాథ సంరక్షనే తత్పరం |
కరిరాజవరద సంగతకరాబ్జం |
సరసీరుహాననం చక్రవిభ్రాజితం
తిరువేంకటాచలధీశం భజేహం ||
Sunday, January 24, 2010
Bhaavayami Gopalabaalam Lyrics in Telugu
భావయామి గోపాలబాలం సాహిత్యం
పల్లవి:
భావయామి గోపాలబాలం మనస్సేవితం |
తత్పదం చింతయేయం సదా ||
చరణాలు
కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా |
పటల నిన దేనా విభ్రాజమానం |
కుటిల పద ఘటిత సంకుల శింజితానతం |
చటుల నటనా సముజ్వల విలాసం ||
నిరతకర కలితనవనీతం బ్రహ్మాది- |
సుర నికర భావనా శోభిత పదం |
తిరు వేంకటాచలస్థితమనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలం ||
పల్లవి:
భావయామి గోపాలబాలం మనస్సేవితం |
తత్పదం చింతయేయం సదా ||
చరణాలు
కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా |
పటల నిన దేనా విభ్రాజమానం |
కుటిల పద ఘటిత సంకుల శింజితానతం |
చటుల నటనా సముజ్వల విలాసం ||
నిరతకర కలితనవనీతం బ్రహ్మాది- |
సుర నికర భావనా శోభిత పదం |
తిరు వేంకటాచలస్థితమనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలం ||
Naanati Batuku Natakamu Lyrics in Telugu
నానాటి బతుకు నాటకము సాహిత్యం...
పల్లవి:
నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము
చరణాలు
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్ట నడిమి పని నాటకము
ఎట్టా ఎదుటా గలది ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము
కుడిచేదన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము
ఒడి గట్టుకొనిన ఉభయకర్మంబుల
గడిదాటిన పుడె కైవల్యము
తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
ఎగువన శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము
పల్లవి:
నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము
చరణాలు
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్ట నడిమి పని నాటకము
ఎట్టా ఎదుటా గలది ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము
కుడిచేదన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము
ఒడి గట్టుకొనిన ఉభయకర్మంబుల
గడిదాటిన పుడె కైవల్యము
తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
ఎగువన శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము
Manujudai Putti Lyrics in Telugu
మనుజుడై పుట్టి మనుజుని సేవించి సాహిత్యం...
పల్లవి:
మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దు:ఖమందనేలా
చరణం 1:
జుట్టెడు కడుపుకై జొరని చోట్లు జొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసు బెట్టి
వట్టిలంపటము వదలనేరడుగాన
చరణం 2:
అందరిలో పుట్టి అందరిలో బెరిగి
అందరి రూపములటుతానై
అందమైన శ్రీ వెంకటాద్రీశు సేవించి
అందరాని పదమందెనటుగాన
పల్లవి:
మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దు:ఖమందనేలా
చరణం 1:
జుట్టెడు కడుపుకై జొరని చోట్లు జొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసు బెట్టి
వట్టిలంపటము వదలనేరడుగాన
చరణం 2:
అందరిలో పుట్టి అందరిలో బెరిగి
అందరి రూపములటుతానై
అందమైన శ్రీ వెంకటాద్రీశు సేవించి
అందరాని పదమందెనటుగాన
Deva Devam Bhaje Lyrics in Telgu
దేవ దేవం భజే సాహిత్యం...
పల్లవి:
దేవ దేవం భజే దివ్య ప్రభావం |
రావణాసుర వైరి రఘు పుంగవం ||
చరం 1:
రాజవర శేఖరం రవికుల సుధాకరం |
ఆజాను బాహుం నీలాభ్ర కాయం |
రాజారి కోదండ రాజదీక్షాగురుం |
రాజీవ లోచనం రామచంద్రం ||
చరణం 2:
నీలజీమూత సన్నిభ శరీర ఘన వి- |
శాల వక్షసం విమల జలజనాభం |
కాలాహి నగ హరం ధర్మ సంస్థాపనం |
భూ లలనధిపం భోగశయనం ||
చరణం 3:
పంకజాసన వినుత పరమ నారాయణం |
సంకరార్జిత చాప దళనం |
లంకా విశోషణం లాలిత విభీషణం |
వేంకటేశం సాధు విబుధ వినతం ||
పల్లవి:
దేవ దేవం భజే దివ్య ప్రభావం |
రావణాసుర వైరి రఘు పుంగవం ||
చరం 1:
రాజవర శేఖరం రవికుల సుధాకరం |
ఆజాను బాహుం నీలాభ్ర కాయం |
రాజారి కోదండ రాజదీక్షాగురుం |
రాజీవ లోచనం రామచంద్రం ||
చరణం 2:
నీలజీమూత సన్నిభ శరీర ఘన వి- |
శాల వక్షసం విమల జలజనాభం |
కాలాహి నగ హరం ధర్మ సంస్థాపనం |
భూ లలనధిపం భోగశయనం ||
చరణం 3:
పంకజాసన వినుత పరమ నారాయణం |
సంకరార్జిత చాప దళనం |
లంకా విశోషణం లాలిత విభీషణం |
వేంకటేశం సాధు విబుధ వినతం ||
Saturday, January 23, 2010
Cheri Yasoda Lyrics in Telugu
చేరి యశోదకు శిశువితడు సాహిత్యం...
పల్లవి:
చేరి యశోదకు శిశువితడు |
ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు ||
చరణం 1:
సొలసి చూచినను సూర్యచంద్రులను |
లలివేద జల్లెడు లక్షణుడు |
నిలిచిన నిలువున నిఖిల దేవతల |
కలిగించు సురల గనివో యితడు ||
చరణం 2:
మాటలాడిననను మరియజాండములు |
కోటులు వొడమెటి గుణరాశి |
నీటుగా నూర్పుల నిఖిల వేదములు |
చాటుగా నూరెటి సముద్రుడితడు ||
చరణం 3:
ముంగిట పొలసిన మొహనమాత్మల |
పొంగించే ఘన పురుషుడు |
సంగతి మావంటి శరణాగతులకు |
అంగము శ్రీవెంకటాధిపుడితడు ||
పల్లవి:
చేరి యశోదకు శిశువితడు |
ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు ||
చరణం 1:
సొలసి చూచినను సూర్యచంద్రులను |
లలివేద జల్లెడు లక్షణుడు |
నిలిచిన నిలువున నిఖిల దేవతల |
కలిగించు సురల గనివో యితడు ||
చరణం 2:
మాటలాడిననను మరియజాండములు |
కోటులు వొడమెటి గుణరాశి |
నీటుగా నూర్పుల నిఖిల వేదములు |
చాటుగా నూరెటి సముద్రుడితడు ||
చరణం 3:
ముంగిట పొలసిన మొహనమాత్మల |
పొంగించే ఘన పురుషుడు |
సంగతి మావంటి శరణాగతులకు |
అంగము శ్రీవెంకటాధిపుడితడు ||
Sunday, January 17, 2010
BhajaGovindam Lyrics in Telugu
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృణ్ కరణే ||1||
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృణ్ కరణే ||1||
భావం: భజించు గోవిందుడిని భజించు గోవిందుడిని... ఓ బుద్ధిహీనుడా గోవిందుడినే భజించు. మరణసమయం ఆసన్నమైనప్పుడు ఈ (డుకృణ్ కరణే లాంటి ) వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవు గాక రక్షించవు.
మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మానస వితృష్ణాం
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం ||2||
భావం: ఓ మూర్ఖుడా! ధనసంపాదన ఆశ విడిచిపెట్టు. మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండు. నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దానితో సంతోషంగా ఉండు.
నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మాగామోహావేశం
ఏతన్మామ్సావసాది వికారం
మనసి విచంతయ వారం వారం ||3||
భావం: స్త్రీల వక్షోజ సౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు. అవి నిజంగా మాంసం, కొవ్వు మొదలైన అసహ్యకర పదార్థములతో కూడినవని నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు.
నళినీ దలగత జలమతి తరలం
తద్వాజ్జీవితమతిశయచపలం
విద్ధి వ్యాద్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం ||4||
భావం: తామరాకు మీద నీటిబొట్టు ఎంత చెంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంత అస్థిరమైనది, అల్పమైనది. అంతేకాదు ఈ మానవ జీవితం అంతా రోగాలతోనూ 'నాది' అన్న మమకారంతోనూ కూడుకున్నట్టిదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైందని తెలుసుకో.
యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్చతి గేహే ||5||
భావం: ఎంతవరకు ధన సంపాదన చెయ్యగలుగుతారో అంతవరకే తనవారంతా ప్రేమగా ఉంటారు. దేహం కాస్త సడలిపోయి, ఏ పని చేయగల శక్తి లేనివారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు. కుశల ప్రశ్నలు కూడా వేయరు.
యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్చతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే ||6||
భావం: ఎంతవరకైతే ఈ దేహం లో ప్రాణం ఉంటుందో అంతవరకే ఇంట్లోనివారు క్షేమాన్ని అడుగుతారు. శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే ఆ చూసి భార్య కూడా భయపడుతుంది.
బాలాస్తావతీ క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః |
వృద్ధస్తావాచ్చింతాసక్తః
పరమే బ్రహ్మణి కో పి సక్తః ||7||
భావం: మానవుడు - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, యౌవనం లో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా!!!
కా తే కాంతా కస్తే పుత్రః
సంసారో యమతీవ విచిత్రః |
కస్య త్వం కః కుత ఆయాతః
తత్వం చింతయ తదిహ భ్రాతః ||8||
భావం: నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నీవు ఎవరు? ఎవరికి చెందినవాడవు? ఎక్కడ నుంచి వచ్చావు? ఓ సోదరా! ఆ తత్వాన్ని ఇక్కడే - ఈ దేహం లో ఉండగానే ఆలోచన చేయి.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తి: ||9||
భావం: సత్పురుషులతో సాంగత్యం చేయడం వల్ల ఈ ప్రాపంచిక విషయాల మీద సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం పోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి.
వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారః
జ్ఞాతే తత్వే కః సంసారః ||10||
భావం: వయస్సు మళ్ళిపోతే కామవికారాలుండవు. నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు.
మా కురు ధన జన యవ్వన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం |
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||11||
భావం: ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యౌవనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిముషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకున్నది, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో. ఆత్మానుభూతిని చెందు.
దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిరవసంతవ్ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః ||12||
భావం: రాత్రింబవళ్ళు, ఉదయం సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి; పోతుంటాయి. కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయుష్కాలం కూడా అలాగే వెళ్లిపోతుంటుంది. అయినప్పటికీ మానవుడు ఆశ అనే గాలిని మాత్రం వదలడు గాక వదలడు.
కాతే కాంతా ధనగతచింతా
వాతుల కిం తవ నాస్తి నియంతా |
త్రిజగతి సజ్జనసంగాతిరేకా
భవతి భవార్ణవతరణే ||13||
భావం: ఓరి వెఱ్ఱివాడా! ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అన్నిటిని, అందరిని నియమించే సర్వజ్ఞుడైన ప్రభువు లేడనుకున్నావా? ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక.
ద్వాదశమంజరికాభిరశేషః
కథితో వైయాకరణస్యైషః .
ఉపదేశో భూద్విద్యానిపుణైః
శ్రీమచ్ఛన్కరభగవచ్ఛరణైః ॥13.అ॥
భావం: ఈ పన్నెండు (2-13) శ్లోకాలు శ్రీ శంకర భగవత్పాదులవారు ఒక వ్యాకరణకర్తకి ఉపదేశంగా ప్రసాదించారు.
జటిలో ముండీ లుంఛితకేశః
కాషాయాంబరబహుకృతవేషః |
పశ్యన్నపి చన పశ్యతి మూఢః
హ్యుదరనిమిత్తం బహుకృతవేషః ||14||
భావం: జడలు కట్టుకొని, గుండు గీయించుకొని, జుట్టు పీకివేసుకొని, కాషాయ వస్త్రాలు ధరించి వేషాలు వేస్తుంటారు. ఈ వేషాలన్నీ పొట్టకూటికోసమే గాని, వీరు కళ్ళతో చూస్తూ కూడా సత్యాన్ని దర్శించలేని మూర్ఖులు.
అంగం గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండం |
వృద్ధో యాతి గృహీత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండం ||15||
భావం: శరీరం కృశించిపోయింది, తల నెరసిపోయింది, నోటిలో పళ్ళు ఊడిపోయినవి. ముసలితనం పైబడి కఱ్ఱ చేతికొచ్చింది. ఐనా సరే ఆశల - కోరికల మూట మాత్రం వదిలిపెట్టడు.
అగ్రే వహ్నిః పృష్ఠేభానుః
రాత్రౌ చుబుకసమర్పితజానుః |
కరతలభిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాసః ||16||
భావం: ఎదురుగా చలిమంట పెట్టుకొని, వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని, రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకుని కూర్చుంటాడు; తిండి తినడానికి రెండు చేతులూ దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. ఐనా ఆశలు మాత్రం వదలడు.
కురుతే గంగాసాగారగమనం
వ్రత పరిపాలన మథవా దానం |
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన ||17||
భావం: తీర్థయాత్రలు చేయవచ్చు; పూజలు, నోములు, వ్రతాలు చేయవచ్చు; దానధర్మాలు చేయవచ్చు. కాని ఆత్మజ్ఞానము పొందనివాడు నూఱు జన్మలెత్తినా సరే ముక్తిని పొందలేడని సర్వమతముల విశ్వాసం.
సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతలమజినం వాసః |
సర్వ పరిగ్రహ భోగ త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః ||18||
భావం: దేవాలయాల్లోనూ, చెట్ల మొదళ్ళలోనూ నివసిస్తూ; కటిక నేల మీద నిద్రిస్తూ; చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ; దేనినీ గ్రహించకుండా - ఏమీ కావాలని కోరుకోకుండా అన్ని భోగాలను విడిచిపెట్టిన ఏ విరాగికి సుఖం లభించదు? తప్పక లభిస్తుంది.
యోగరతో వా భోగరతో వా
సంగరతో వా సంగవిహీనః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ ||19||
భావం: ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు; ఈ ప్రపంచంలో అందరితో కలిసి మెలిసి జీవించవచ్చు లేదా ఒంటరిగా అందరికీ దూరంగా జీవించవచ్చు. కాని ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో అట్టివారే ఆనందిస్తారు. ముమ్మాటికీ అట్టివారికే ఆనందం.
భగవద్గీతా కించిదధీత
గంగా జలలవ కణికాపీతా |
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేవ న చర్చ ||20||
భావం: ఎవరైతే భగవద్గీతని కొంచమైనా అధ్యయనం చేస్తారో, గంగా జలాన్ని కొద్దిగా ఐనా తాగుతారో, కొంచమైనా శ్రీకృష్ణుని పూజిస్తారో అట్టివారికి యమునితో వివాదం ఉండదు.
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసార బహు దుస్తారే
కృపయా పారే పాహి మురారే ||21||
భావం: మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం; మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం - ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం కష్టమైన పని. కనుక ఓ కృష్ణా! దయచేసి మమ్ములను రక్షించు.
రథ్యా చర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జిత పంథః |
యోగి యోగనియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవదేవ ||22||
భావం: దారిలో దొరికే గుడ్డ పీలికలతో తయారైన గోచిని ధరించిన వాడై; ఇది పుణ్యమని, అది పాపమని ఏ మాత్రం ఆలోచించక, నిరంతరం మనసుని యోగమునందే నిలిపిన యోగిపుంగవుడు ఈ లోకంలో బాలునిలాగ, పిచ్చివానిగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
కస్త్వం కోహం కుత ఆయాతః
కా మే జనని కో మే తాతః |
ఇతి పరభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం ||23||
భావం: నీవెవరు? నేనెవరు? ఎక్కడ నుండి వచ్చాను? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? ఇదీ నువ్వు విచారణ చెయ్యవలసినది. ఈ ప్రపంచం సారహీనమైనది; కేవలం కలలో కనిపించు దృశ్యం లాంటిదే అని దీనిని విడిచిపెట్టు.
త్వయి మయి చాన్యత్రైకో విష్ణు:
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు: |
భవ సమచిత్తః సర్వత్ర త్వం
వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం ||24||
భావం: నీలోను, నాలోను, ఇతరులలోను ఉన్నది ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే. సహనం లేనివాడివి కనుక నాపై కోపగించుకుంటున్నావు. నీవు బ్రహ్మత్వం (మోక్షం) ను పొందగోరితివా! అంతటా - అన్నివేళలా సమబుద్ధిని కలిగి ఉండు.
శత్రౌ మిత్రే పుత్రే బంధవ్
మా కురు యత్నం విగ్రహ సంధవ్ |
సర్వస్మిన్నపి పశ్యాత్మానం
సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం ||25||
భావం: శత్రువు గాని, మిత్రుడు గాని, పుత్రుడు గాని, బంధువు గాని - వీరిపట్ల శత్రుత్వమో, స్నేహమో చేసే యత్నం మానుకో. అందరిలోను ఆత్మను చూస్తూ, భేదభావాన్ని అన్ని సందర్భాలలోనూ విడిచిపెట్టు.
కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వా త్మానం భావయ కోహం |
ఆత్మజ్ఞాన విహీనా మూడాః
తే పచ్యంతే నరకనిగూడః ||26||
భావం: కోరిక, కోపం, లోభం, భ్రాంతి - వీటన్నిటిని విడిచిపెట్టిన సాధకుడు "ఆ పరమాత్మను నేనే " అనే సత్యాన్ని దర్శిస్తాడు. ఆత్మజ్ఞానం లేనివారు మూఢులు. అట్టివారు ఈ సంసార జనన మరణ చక్రం అనే నరకంలో బంధింపబడి హింసించబడతారు.
గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం ||27||
భావం: భగవద్గీత, విష్ణు సహస్రనామాలను గానం చెయ్యాలి. ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యంలో మనసుని నడపాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చెయ్యాలి.
సుఖతః క్రియతే రామాభోగః
పశ్చాద్ధంత శరీరే రోగః |
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణం ||28||
భావం: సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతి కార్యంలో నిమగ్నమవుతారు. దాని కారణంగా శరీరం రోగాలపాలవుతుంది. చివరికి మరణం అనేది ఎవరికి తప్పదు. ఐనా సరే మానవుడు పాప కార్యములను వదలనే వదలడు.
అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశః సత్యం |
పుత్రాదపి ధన భాజాం భీతి:
సర్వత్రైషా విహితా రీతి: ||29||
భావం: డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. దాని వల్ల కొంచం సుఖం కూడా లేదు అనే మాట సత్యం. ధనవంతునికి తన కుమారిని వల్ల కూడా భయమే. అన్ని చోట్ల డబ్బు యొక్క పద్ధతి ఇంతే.
ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేకవిచారం |
జాప్యసమేత సమాధివిధానం
కుర్వవధానం మహదవధానం ||30||
భావం: క్రమపద్ధతిలో శ్వాసను నియమించడం; విషయాల నుండి మనసుని వెనక్కి మళ్లించడం; నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో నిరంతరం బుద్ధితో విచారించడం; జపంతో కూడుకున్న ధ్యాననిష్ఠను సాగించి సర్వ సంకల్పాలను విడిచిపెట్టడం అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించు.
గురుచరణా౦బుజ నిర్భర భక్తః
సంసారాదచిరార్భవ ముక్తః |
సేంద్రియమానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ||31||
భావం: గురుచరణ కమలములనే సర్వస్వంగా భావించిన ఓ భక్తుడా! నీ ఇంద్రియాలను, మనసుని నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ చావు పుట్టుకులతో కూడిన సంసార సాగరం నుండి ముక్తుడవై, నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారం పొందెదవు గాక!
మూఢః కశ్చన వైయాకరణో
డుకృన్కరణాధ్యయన ధురిణః .
శ్రీమచ్ఛమ్కర భగవచ్ఛిష్యై
బోధిత ఆసిచ్ఛోధితకరణః ॥32॥
భావం: వ్యాకరణ నియమాలతో తనను తాను కోల్పోయి మూఢుడైన వ్యాకరణకర్త, శంకర భగవత్పాదులవారి బోధనలతో కడిగివేయబడ్డాడు.
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
గోవిందం భజ మూఢమతే
నామస్మరణాదన్యముపాయం
నహి పశ్యామో భవతరణే ॥33॥
భావం: భజించు గోవిందుని! భజించు గోవిందుని! ఓ మూఢుడా గోవిందుడినే భజించు. సంసార సాగరాన్ని దాటడానికి గోవింద నామస్మరణకి మించినది లేదు.
|| ఇతి భజగోవిందం సంపూర్ణం ||
In M.S Amma Voice
Complete verses
Tuesday, January 12, 2010
Govindaashtakam Lyrics in Telugu
గోవిందాష్టకం ...
సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం
గోష్ట ప్రాంగణ రింగన లోలమనయాసం పరమాయాసం
మాయ కల్పిత నానాకరమనాకరం భువనాకరం
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం. 1
మ్రుత్సనమత్సి హేతి యశోద తాడన శైశవ సంత్రాసం
వ్యధిత వక్త్ర లోకిత లోక లోకచతుర్దాశ లోకాలీం
లోకత్రయపుర మూలస్థంభం లోకాలోకమనలోకం
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం. 2
త్రైవిష్ట పరిపువీరగ్నం క్షితి భారగ్నం భావరోగాగ్నం
కైవల్యం నవనీతా హార మనాహారం భువనాహారం
వైమల్య స్ప్హుట చేతో వృత్తి విశేషభాసమనభాసం
శైవం కేవల శాంతం ప్రణమత గోవిందం పరమానందం. 3
గోపాలం ప్రభు లీల విగ్రహ గోపాలం కుల గోపాలం
గోపీ ఖేలన గోవర్ధన ద్రుత లీల లాలిత గోపాలం
గోపిర్నిగదిత గోవింద స్ప్హుట నామానం బహు నామాననం
గోభీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం. 4
గోపి మండల గోష్ఠీ భేదం భేదావస్థమభేధాభం
శస్వత్గోఖుర నిర్భూతోద్గత ధూళి దూసర సౌభాగ్యం
శ్రద్ధా భక్తి గ్రహీతానంద మచిన్త్యం చింతిత సద్భావం
చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం. 5
స్నాన వ్యాకుల యోషిద్వస్త్ర ముపాదాయాగ ముపారూఢo
వ్యాదిత్సంతీరధ దిగ్వస్త్ర దాతుముపకర్షంతాః
నిర్ధూతద్వయ శోక విమొహం బుద్ధం బుద్దేరంతస్థం
సత్తా మాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానందం. 6
కాంతం కారణ కారణ మనాదిమనాదిం కాల ఘనాభాసం
కాళింది గత కాళియ శిరసిసు నృత్యంతం ముహురత్యంతం
కాలం కాల కలాతీతం కలితాశేషం కలిదోషగ్నం
కాలత్రయ గత హేతుం ప్రణమత గోవిందం పరమానందం. 7
వృందావన భువి వృన్ధారక గణ వృన్దారాధిత వందేహం
కుందాభామల మందస్మేర సుధానందం సుహృతానందం
వంద్యాశేష మహాముని మానస వంద్యానంద పదద్వంద్వం
వంద్యాశేష గుణాబ్దిం ప్రణమత గోవిందం పరమానందం. 8
గోవిన్దాష్టకమేతత్ అధీతే గోవిన్దార్పిత చేతయః
గోవింద అచ్యుత మాధవ విష్ణో గోకుల నాయక కృష్ణేతి
గోవిందాoఘ్రి సరోజ ధ్యాన సుధా జలధౌత సమస్తాఘః
గోవిందం పరమానందామృతం అతస్థం స తమభేత్యే. 9
సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం
గోష్ట ప్రాంగణ రింగన లోలమనయాసం పరమాయాసం
మాయ కల్పిత నానాకరమనాకరం భువనాకరం
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం. 1
మ్రుత్సనమత్సి హేతి యశోద తాడన శైశవ సంత్రాసం
వ్యధిత వక్త్ర లోకిత లోక లోకచతుర్దాశ లోకాలీం
లోకత్రయపుర మూలస్థంభం లోకాలోకమనలోకం
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం. 2
త్రైవిష్ట పరిపువీరగ్నం క్షితి భారగ్నం భావరోగాగ్నం
కైవల్యం నవనీతా హార మనాహారం భువనాహారం
వైమల్య స్ప్హుట చేతో వృత్తి విశేషభాసమనభాసం
శైవం కేవల శాంతం ప్రణమత గోవిందం పరమానందం. 3
గోపాలం ప్రభు లీల విగ్రహ గోపాలం కుల గోపాలం
గోపీ ఖేలన గోవర్ధన ద్రుత లీల లాలిత గోపాలం
గోపిర్నిగదిత గోవింద స్ప్హుట నామానం బహు నామాననం
గోభీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం. 4
గోపి మండల గోష్ఠీ భేదం భేదావస్థమభేధాభం
శస్వత్గోఖుర నిర్భూతోద్గత ధూళి దూసర సౌభాగ్యం
శ్రద్ధా భక్తి గ్రహీతానంద మచిన్త్యం చింతిత సద్భావం
చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం. 5
స్నాన వ్యాకుల యోషిద్వస్త్ర ముపాదాయాగ ముపారూఢo
వ్యాదిత్సంతీరధ దిగ్వస్త్ర దాతుముపకర్షంతాః
నిర్ధూతద్వయ శోక విమొహం బుద్ధం బుద్దేరంతస్థం
సత్తా మాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానందం. 6
కాంతం కారణ కారణ మనాదిమనాదిం కాల ఘనాభాసం
కాళింది గత కాళియ శిరసిసు నృత్యంతం ముహురత్యంతం
కాలం కాల కలాతీతం కలితాశేషం కలిదోషగ్నం
కాలత్రయ గత హేతుం ప్రణమత గోవిందం పరమానందం. 7
వృందావన భువి వృన్ధారక గణ వృన్దారాధిత వందేహం
కుందాభామల మందస్మేర సుధానందం సుహృతానందం
వంద్యాశేష మహాముని మానస వంద్యానంద పదద్వంద్వం
వంద్యాశేష గుణాబ్దిం ప్రణమత గోవిందం పరమానందం. 8
గోవిన్దాష్టకమేతత్ అధీతే గోవిన్దార్పిత చేతయః
గోవింద అచ్యుత మాధవ విష్ణో గోకుల నాయక కృష్ణేతి
గోవిందాoఘ్రి సరోజ ధ్యాన సుధా జలధౌత సమస్తాఘః
గోవిందం పరమానందామృతం అతస్థం స తమభేత్యే. 9
Wednesday, January 6, 2010
Sri Venkatesa Karavalamba Stotram Lyrics in Telugu
శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే
నారాయణాచ్యుతా హరే నళినాయతాక్ష
లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలం
బ్రహ్మాది వందిత పదాంబుజ శంఖపాణే
శ్రీమత్ సుదర్శన సుశోభిత దివ్యహస్త
కారుణ్య సాగర శరణ్య సుపుణ్యమూర్తే
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
వేదాంత వేద్య భవసాగర కర్ణధారా
శ్రీ పద్మనాభ కమలర్చిత పాద పద్మ
లోకైక పావన పరాత్పర పాప హారిణ్
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
లక్ష్మీపతే నిగమలక్ష్య నిజ స్వరూప
కామదిదోష పరిహరక బోధదాయిన్
దైత్యాదిమర్ధన జనార్ధన వాసుదేవ
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
తాపత్రయం హర విభోరభాస మురారే
సంరక్షమాం కరుణయా సరసీరుహక్ష
మచ్సిష్య మిత్యనుదినం పరిరక్ష విష్ణో
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
శ్రీజాతరూప నవరత్నలసత్కిరీట
కస్తూరికా తిలక శోభి లలాట దేశ
రాకేందుబింబ వదనాంబుజ వారిజాక్ష
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
వందారులోక వరదానవచోవిలాస
రత్నాడ్యహార పరిశోభిత కంబుకంఠా
కేయూర రత్న సువిభాసి దిగంతరాల
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
దివ్యాంగదాంచిత భుజద్వయ మంగళాత్మన్
కేయూరభూషణ సుశోభిత దీర్ఘ బాహో
నాగేంద్ర కంకణ కరద్వయ కామదాయిన్
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
స్వామిన్ జగద్ధ్హరణ వారిది మధ్యమగ్నం
మాముగ్ధరాజ్య కృపయా కరుణాపయోధే
లక్ష్మీంశ్చ దేహి మమ ధర్మ సంరుద్ధ్హి హేతుం
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
దివ్యాంగ రాగ పరిచర్చిత కోమళామ్గ
పీతంబరావృత తనో, తరుణార్క దీప్తే
సాత్కాంచనాభా పరిధానసుపట్ట బంధా
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
రత్నాడ్యధామ సునిబద్ధ్హ కటిప్రదేశా
మాణిక్య దర్పణ సుసన్నిభజానుదేశ
జంఘాధ్వయేన పరిమోహిత సర్వలోక
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
లోకైకపావన సరిత్పరిశోభితాంగే
త్వత్పాద దర్శన దినే చ మమాఘమీస
హార్ధం తమశ్చ సకలం లయమాప భూమన్
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
కామాది వైరి నివహోచ్యుత మే ప్రయాతః
దారిద్ర్య మప్యపదనం సకలం దయాళో
దీనం చమాం సమవలోక్య దయార్ర్ద్ర దృష్ట్యా
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
శ్రీ వెంకటేశ పద పంకజ షడ్పదేనా
శ్రీమన్ నృసింహ యతినా రచితం జగత్యాం
యే తత్ పఠమ్తి మనుజః పురుషోత్తమస్య
తే ప్రాప్నువంతి పరమం పదవీం మురారే:
ఇతి శృంగేరి జగత్గురున శ్రీ నృసిమ్హభారతి స్వామిన రచితం
శ్రీ వెంకటేశ కరావలంబ స్తోత్రం సంపూర్ణం
నారాయణాచ్యుతా హరే నళినాయతాక్ష
లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలం
బ్రహ్మాది వందిత పదాంబుజ శంఖపాణే
శ్రీమత్ సుదర్శన సుశోభిత దివ్యహస్త
కారుణ్య సాగర శరణ్య సుపుణ్యమూర్తే
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
వేదాంత వేద్య భవసాగర కర్ణధారా
శ్రీ పద్మనాభ కమలర్చిత పాద పద్మ
లోకైక పావన పరాత్పర పాప హారిణ్
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
లక్ష్మీపతే నిగమలక్ష్య నిజ స్వరూప
కామదిదోష పరిహరక బోధదాయిన్
దైత్యాదిమర్ధన జనార్ధన వాసుదేవ
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
తాపత్రయం హర విభోరభాస మురారే
సంరక్షమాం కరుణయా సరసీరుహక్ష
మచ్సిష్య మిత్యనుదినం పరిరక్ష విష్ణో
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
శ్రీజాతరూప నవరత్నలసత్కిరీట
కస్తూరికా తిలక శోభి లలాట దేశ
రాకేందుబింబ వదనాంబుజ వారిజాక్ష
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
వందారులోక వరదానవచోవిలాస
రత్నాడ్యహార పరిశోభిత కంబుకంఠా
కేయూర రత్న సువిభాసి దిగంతరాల
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
దివ్యాంగదాంచిత భుజద్వయ మంగళాత్మన్
కేయూరభూషణ సుశోభిత దీర్ఘ బాహో
నాగేంద్ర కంకణ కరద్వయ కామదాయిన్
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
స్వామిన్ జగద్ధ్హరణ వారిది మధ్యమగ్నం
మాముగ్ధరాజ్య కృపయా కరుణాపయోధే
లక్ష్మీంశ్చ దేహి మమ ధర్మ సంరుద్ధ్హి హేతుం
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
దివ్యాంగ రాగ పరిచర్చిత కోమళామ్గ
పీతంబరావృత తనో, తరుణార్క దీప్తే
సాత్కాంచనాభా పరిధానసుపట్ట బంధా
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
రత్నాడ్యధామ సునిబద్ధ్హ కటిప్రదేశా
మాణిక్య దర్పణ సుసన్నిభజానుదేశ
జంఘాధ్వయేన పరిమోహిత సర్వలోక
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
లోకైకపావన సరిత్పరిశోభితాంగే
త్వత్పాద దర్శన దినే చ మమాఘమీస
హార్ధం తమశ్చ సకలం లయమాప భూమన్
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
కామాది వైరి నివహోచ్యుత మే ప్రయాతః
దారిద్ర్య మప్యపదనం సకలం దయాళో
దీనం చమాం సమవలోక్య దయార్ర్ద్ర దృష్ట్యా
శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం
శ్రీ వెంకటేశ పద పంకజ షడ్పదేనా
శ్రీమన్ నృసింహ యతినా రచితం జగత్యాం
యే తత్ పఠమ్తి మనుజః పురుషోత్తమస్య
తే ప్రాప్నువంతి పరమం పదవీం మురారే:
ఇతి శృంగేరి జగత్గురున శ్రీ నృసిమ్హభారతి స్వామిన రచితం
శ్రీ వెంకటేశ కరావలంబ స్తోత్రం సంపూర్ణం
Tuesday, January 5, 2010
Materani chinnadani Lyrics in Telugu
మాటేరాని చిన్నదాని సాహిత్యం...
పల్లవి:
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచె జ్ఞాపకాలురా
రేగే మూగ తలపె వలపు పంట రా ||మాటేరాని||
చరణం 1:
వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరెను
చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్ట పగలె నింగిన పొడిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే ||మాటేరాని||
చరణం 2 :
ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు
సందె వేళ పలికే నా లో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలుపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే ||మాటేరాని||
పల్లవి:
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచె జ్ఞాపకాలురా
రేగే మూగ తలపె వలపు పంట రా ||మాటేరాని||
చరణం 1:
వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరెను
చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్ట పగలె నింగిన పొడిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే ||మాటేరాని||
చరణం 2 :
ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు
సందె వేళ పలికే నా లో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలుపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే ||మాటేరాని||
Srimannarayana Lyrics in Telugu
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ సాహిత్యం...
పల్లవి:
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ |
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ||
చరణం:
పల్లవి:
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ |
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ||
చరణం:
కమలాసతీ ముఖకమల కమలహిత |
కమలప్రియ కమలేక్షణ |
కమలాసనహిత గరుడగమన శ్రీ |
కమలనాభ నీ పదకమలమే శరణు ||
పరమయోగిజన భాగ్యధేయ శ్రీ |
పరమపూరుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ |
తిరువేంకటగిరి దేవ శరణు ||
కమలప్రియ కమలేక్షణ |
కమలాసనహిత గరుడగమన శ్రీ |
కమలనాభ నీ పదకమలమే శరణు ||
పరమయోగిజన భాగ్యధేయ శ్రీ |
పరమపూరుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ |
తిరువేంకటగిరి దేవ శరణు ||
Dolayamchala Dolayam Lyrics in Telugu
డోలాయంచల డోలయం ...
పల్లవి:
డోలాయాం చల డొలాయాం హరే డొలాయాం
చరణం:
మీన కూర్మ వరాహ మృగపతి అవతార |
దానవారే గుణషౌరే ధరణీధర మరుజనక ||
వామన రామ రామ వరకృష్ణ అవతార |
శ్యామలాంగా రంగ రంగ సామజవరద మురహరణ ||
దారుణ బుద్ధ కలికి దశవిధ అవతార |
శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరి కూటనిలయా ||
పల్లవి:
డోలాయాం చల డొలాయాం హరే డొలాయాం
చరణం:
మీన కూర్మ వరాహ మృగపతి అవతార |
దానవారే గుణషౌరే ధరణీధర మరుజనక ||
వామన రామ రామ వరకృష్ణ అవతార |
శ్యామలాంగా రంగ రంగ సామజవరద మురహరణ ||
దారుణ బుద్ధ కలికి దశవిధ అవతార |
శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరి కూటనిలయా ||
Sunday, January 3, 2010
Siva panchakshari Lyrics in Telugu
శివ పంచాక్షరి స్తోత్రం
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ || 1
మందాకినీ సలిల చందనచర్చితాయ నందీశ్వర ప్రమథ నాథ మహేశ్వరాయ |
మందారపుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ || 2
శివాయ గౌరీవదనాబ్జ వృందా సూర్యాయ దక్షధ్వరనాశకాయ |
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికరాయ నమః శివాయ || 3
వశిష్ఠ కుంభోద్భవ గౌతమాయ మునీంద్ర దేవార్చితశేఖరాయ |
చంద్రార్కవైశ్వానరలోచానాయ తస్మై వకారాయ నమః శివాయ || 4
యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకరాయ నమః శివాయ || 5
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేశ్శివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహామోదతే ||
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ || 1
మందాకినీ సలిల చందనచర్చితాయ నందీశ్వర ప్రమథ నాథ మహేశ్వరాయ |
మందారపుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ || 2
శివాయ గౌరీవదనాబ్జ వృందా సూర్యాయ దక్షధ్వరనాశకాయ |
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికరాయ నమః శివాయ || 3
వశిష్ఠ కుంభోద్భవ గౌతమాయ మునీంద్ర దేవార్చితశేఖరాయ |
చంద్రార్కవైశ్వానరలోచానాయ తస్మై వకారాయ నమః శివాయ || 4
యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకరాయ నమః శివాయ || 5
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేశ్శివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహామోదతే ||
Durga Pancharatnam Lyrics in Telugu
దుర్గ పంచరత్నం సాహిత్యం...
తే ధ్యాన యోగానుగాతాపస్యన్
త్వామేవ దేవీం స్వగునైర్నిగూడాం
త్వమేవ శక్తిహి పరమేశ్వరస్య
మాం పాహి సర్వేశ్వరీ మోక్షదాత్రి. 1
దేవాత్మ శక్తీహీ శ్రుతివాక్య గీత
మహర్షిలోకస్య పుర: ప్రసన్న
గుహపరం వ్యోమ సద ప్రతిష్ఠ
మాం పాహి సర్వేశ్వరీ మోక్షదాత్రి . 2
పరాస్యశక్తిహీ వివిధైవ శ్రూవ్యసే
శ్వేతాశ్వ వాక్యోదిత దేవీ దుర్గే
స్వాభావికీ జ్ఞాన బలక్రియార్తే
మాం పాహి సర్వేశ్వరీ మోక్షదాత్రి . 3
దేవాత్మ శబ్దేన శివాత్మ భూత
యత్కూర్మ వాయవ్య వచో వివృత్య
త్వంపాశ విఛ్చేద కరి ప్రసిద్ద్హ
మాం పాహి సర్వేశ్వరీ మోక్షదాత్రి. 4
త్వం బ్రహ్మ పుచ్చా వివిధా మయూరీ
బ్రహ్మ ప్రతిష్ఠాసి ఉపతిష్ట గీత
జ్ఞాన స్వరుపాత్మదయఖిలానాం
మాం పాహి సర్వేశ్వరీ మోక్షదాత్రి. 5
తే ధ్యాన యోగానుగాతాపస్యన్
త్వామేవ దేవీం స్వగునైర్నిగూడాం
త్వమేవ శక్తిహి పరమేశ్వరస్య
మాం పాహి సర్వేశ్వరీ మోక్షదాత్రి. 1
దేవాత్మ శక్తీహీ శ్రుతివాక్య గీత
మహర్షిలోకస్య పుర: ప్రసన్న
గుహపరం వ్యోమ సద ప్రతిష్ఠ
మాం పాహి సర్వేశ్వరీ మోక్షదాత్రి . 2
పరాస్యశక్తిహీ వివిధైవ శ్రూవ్యసే
శ్వేతాశ్వ వాక్యోదిత దేవీ దుర్గే
స్వాభావికీ జ్ఞాన బలక్రియార్తే
మాం పాహి సర్వేశ్వరీ మోక్షదాత్రి . 3
దేవాత్మ శబ్దేన శివాత్మ భూత
యత్కూర్మ వాయవ్య వచో వివృత్య
త్వంపాశ విఛ్చేద కరి ప్రసిద్ద్హ
మాం పాహి సర్వేశ్వరీ మోక్షదాత్రి. 4
త్వం బ్రహ్మ పుచ్చా వివిధా మయూరీ
బ్రహ్మ ప్రతిష్ఠాసి ఉపతిష్ట గీత
జ్ఞాన స్వరుపాత్మదయఖిలానాం
మాం పాహి సర్వేశ్వరీ మోక్షదాత్రి. 5
Ksheerabdi Kanyakaku Lyrics in Telugu
క్షీరాబ్ది కన్యకకు సాహిత్యం...
పల్లవి:
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరంజనం
చరణం 1:
జలజాక్షి మోమునకు జక్కవకుచేమ్ములకు
నెలకొన్న కప్పురపు నీరంజనం
అలివేణి తురుమునకు హస్త కమలమ్ములకు
నిలువు మాణిక్యముల నీరంజనం ||క్షీరాబ్ది కన్యకకు||
చరణం 2:
చరణ కిసలయములకు సకియలంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు నతివ నిజ నభికిని
నిరతి నానావర్ణ నీరాజనం ||క్షీరాబ్ది కన్యకకు||
చరణం 3:
పగటు శ్రీ వెంకటేశు పట్టపు రాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి అలమేలుమంగ జక్కదనములకేల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం ||క్షీరాబ్ది కన్యకకు||
పల్లవి:
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరంజనం
చరణం 1:
జలజాక్షి మోమునకు జక్కవకుచేమ్ములకు
నెలకొన్న కప్పురపు నీరంజనం
అలివేణి తురుమునకు హస్త కమలమ్ములకు
నిలువు మాణిక్యముల నీరంజనం ||క్షీరాబ్ది కన్యకకు||
చరణం 2:
చరణ కిసలయములకు సకియలంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు నతివ నిజ నభికిని
నిరతి నానావర్ణ నీరాజనం ||క్షీరాబ్ది కన్యకకు||
చరణం 3:
పగటు శ్రీ వెంకటేశు పట్టపు రాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి అలమేలుమంగ జక్కదనములకేల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం ||క్షీరాబ్ది కన్యకకు||
Bhaavamulona Lyrics in Telugu
పల్లవి:
భావములోన బాహ్యమునందును
గోవింద గోవిందా అని కొలువవో మనసా ||భావములోన||
చరణం 1:
హరి యవతారములే అఖిల దేవతలు
హరిలోనివే బ్రహ్మండంములు ||2||
హరి నామమ్ములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి హరియనవో మనసా ||భావములోన||
చరణం 2:
విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడేటి వేదమ్ములు
విష్ణువొక్కడే విశ్వంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా ||భావములోన||
చరణం 3:
అచ్యుతుడితడే ఆదియునంత్యమును
అచ్యుతుడేలే అసురాంతకుడు
అచ్యుడు శ్రీ వెంకటాద్రి మీద నిదె
అచ్యుతా అచ్యుతా శరణనవో మనసా ||భావములోన||
Sasi vadane sasi vadane Lyrics
శశివదనే శశివదనే సాహిత్యం...
పల్లవి:
పల్లవి:
శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవ
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా
అచ్చోచేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగానే గుచ్చేతేటి కులుకుసిరి నీదా ||2||
నవమధన నవమధన కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడ విడువకు మురిసిన బాట ||అచ్చోచేటి వెన్నెలలో||
చరణం:
మదన మోహిని చూపులోన మాండు రాగామేలా ||2|| పడుచు వాడిని కన్నవీక్షణ పంచదార కాదా
కల ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం ||2 ||
చందనం కలిసిన ఊపిరిలో
కరిగే మేఖల కట్టినీయిల్లె ||శశివదనే||
చరణం:
నెయ్యం వియ్యం ఎదేధైనా తనువు నిలువదెల ||2 ||
నేను నీవు ఎవ్వరికేవరం వలపు చిలికేనేల
ఒకే ఒక చైత్రవేళ ఉరే విడి పూతలాయే ||2 ||
అమృతం కురిసిన రాతిరిలో
జాబిలీ హృదయం జత చేరే ||శశివదనే||
Subscribe to:
Posts (Atom)