పల్లవి:
భావములోన బాహ్యమునందును
గోవింద గోవిందా అని కొలువవో మనసా ||భావములోన||
చరణం 1:
హరి యవతారములే అఖిల దేవతలు
హరిలోనివే బ్రహ్మండంములు ||2||
హరి నామమ్ములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి హరియనవో మనసా ||భావములోన||
చరణం 2:
విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడేటి వేదమ్ములు
విష్ణువొక్కడే విశ్వంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా ||భావములోన||
చరణం 3:
అచ్యుతుడితడే ఆదియునంత్యమును
అచ్యుతుడేలే అసురాంతకుడు
అచ్యుడు శ్రీ వెంకటాద్రి మీద నిదె
అచ్యుతా అచ్యుతా శరణనవో మనసా ||భావములోన||
No comments:
Post a Comment