Showing posts with label Ilayaraja. Show all posts
Showing posts with label Ilayaraja. Show all posts

Tuesday, January 5, 2010

Materani chinnadani Lyrics in Telugu

మాటేరాని చిన్నదాని సాహిత్యం...

పల్లవి:
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచె జ్ఞాపకాలురా
రేగే మూగ తలపె వలపు పంట రా  ||మాటేరాని||

చరణం 1:
వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరెను
చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్ట పగలె నింగిన పొడిచెను
కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే ||మాటేరాని||

చరణం 2 :
ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు
సందె వేళ పలికే నా లో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలుపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే   ||మాటేరాని||