క్షీరాబ్ది కన్యకకు సాహిత్యం...
పల్లవి:
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరంజనం
చరణం 1:
జలజాక్షి మోమునకు జక్కవకుచేమ్ములకు
నెలకొన్న కప్పురపు నీరంజనం
అలివేణి తురుమునకు హస్త కమలమ్ములకు
నిలువు మాణిక్యముల నీరంజనం ||క్షీరాబ్ది కన్యకకు||
చరణం 2:
చరణ కిసలయములకు సకియలంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు నతివ నిజ నభికిని
నిరతి నానావర్ణ నీరాజనం ||క్షీరాబ్ది కన్యకకు||
చరణం 3:
పగటు శ్రీ వెంకటేశు పట్టపు రాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి అలమేలుమంగ జక్కదనములకేల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం ||క్షీరాబ్ది కన్యకకు||
No comments:
Post a Comment