Sunday, December 27, 2009

Marali marali Jaya Mangalamu Lyrics

మరలి మరలి జయ మంగళము  సాహిత్యం...


                                        


పల్లవి:

మరళి మరళి జయ మంగళము |
సొరిది నిచ్చలును శుభ మంగళము ||

చరణం 1:
కమలా రమణికి కమలాక్షునకును |
మమతల జయ జయ మంగళము
అమర జననికిని అమరవంద్యునకు |
సుముహూర్తముతో శుభ మంగళము ||

చరణం 2:
జలధికన్యకును జలధిశాయికిని |
మలయుచును శుభ మంగళము |
కలిమికాంతకు ఆ కలికి విభునికిని |
సుళువులయారతి శుభ మంగళము ||

చరణం 3:
చిత్తజు తల్లికి శ్రీ వేంకటపతికి |
మత్తిల్లిన జయ మంగళము |
ఇత్తల నత్తల ఇరువురకౌగిట |
జొత్తుల రతులకు శుభ మంగళము ||



No comments: