Music: RP Patnaik
Lyrics: RP, Kulasekhar
Singer: Bombay Jayasree
పల్లవి: తియతీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
ఎన్నాళ్ళైనా నేనుండిపోగలను నీ కౌగిళ్ళలో
నేనవరన్నది నే మరచిపోగలను చూస్తూ నీ కళ్ళలో ॥ తియతీయని ॥
చరణం 1: చలచల్లని మంచుకి అర్థమే కాదు ప్రేమ చలవేమిటో
నునువెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో
వచ్చీరానీ కన్నీళ్ళకే తెలుసు ప్రేమ లోతేమిటో
ముద్దేలేని అధరాలకే తెలుసు ఈడు బాధేమిటో ॥ తియతీయని ॥
చరణం 2: మురిపెంతో సరసం తీర్చమంటోంది ప్రాయమీవేళలో
తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో
విరహంతో పరువం కరిగిపోతోంది ఆవిరై గాలిలో
కలిసుండే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్ళలో ॥ తియతీయని ॥